RRR: వైసీపీ ఎంపీల ఫిర్యాదు నేపథ్యంలో ఎంపీ రఘురామకు లోక్‌సభ సచివాలయం నోటీసులు

|

Jul 16, 2021 | 7:25 AM

ఫిరాయింపుల వ్యతిరేక చట్టం క్రింద ఎంపీలు శిశిర్ అధికారి, సునీల్ కుమార్ మండల్ , కె రఘురామ కృష్ణంరాజులకు....

RRR: వైసీపీ ఎంపీల ఫిర్యాదు నేపథ్యంలో ఎంపీ రఘురామకు లోక్‌సభ సచివాలయం నోటీసులు
Raghuramakrishna Raju
Follow us on

ఫిరాయింపుల వ్యతిరేక చట్టం క్రింద ఎంపీలు శిశిర్ అధికారి, సునీల్ కుమార్ మండల్ , కె రఘురామ కృష్ణంరాజులకు లోక్‌సభ సచివాలయం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. టీఎంసీ టిక్కెట్లపై అధికారి, మండల్ ఎన్నికైనప్పటికీ బీజేపీలో చేరడంతో  నోటీసులు జారీ చేయగా, రఘురామ కృష్ణంరాజు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. లైన్ క్రాస్ చేసిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలంటూ టీఎంసీ, వైయస్ఆర్ కాంగ్రెస్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను సంప్రదించాయి. ఈ క్రమంలో 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఎంపీలకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

ఏపీ ప్రభుత్వానికి, రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు మధ్య గత కొంతకాలంగా వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. రఘురామ, జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ వేయడం, మరోవైపు రఘురామను డిస్‌క్వాలిఫై చేయాలంటూ లోక్ సభ స్పీకర్‌ను ఆ పార్టీ ఎంపీలు అప్రోచ్ అవ్వడం తెలిసిందే. అయితే జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌‌ విషయంలో సీబీఐ కౌంటర్‌ ఫైల్‌ చేసినా చేయకపోయినా జులై 26న కోర్టు తుది ఉత్తర్వులిస్తుందని రఘురామ ఇటీవల తెలిపారు. ఈ విషయాన్ని న్యాయమూర్తి చెప్పినట్లు తమ న్యాయవాది తెలిపారని, అందువల్ల ఆ రోజు చాలా ఇంపార్టెంట్ అని రఘురామ పేర్కొన్నారు. ఈ విషయంలో న్యాయం జరుగుతుందనే తాను ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు.

Also  Read: ఆగస్టు చివరిలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం: ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్త

నేడు, రేపు తెలంగాణలో అతిభారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ.