జేజమ్మకే జై.. త్వరలో బిజెపి పగ్గాలు !

|

Oct 30, 2019 | 7:45 PM

ఎన్నికలొచ్చే దాకా ఊదరగొట్టడం.. ఎన్నికల్లో చతికిలా పడడం.. అడపాదడపా ఢిల్లీ నేతల పుణ్యం వల్లో.. టిడిపి లాంటి పార్టీతో పొత్తుల వల్లో ఒకటో అరో సీట్లు గెల్చుకోవడం.. ఇదీ తెలంగాణా బిజెపి అనగానే మనకు అనిపించేది.. పలు నోళ్ళలో వినిపించేది. అయితే.. ఇప్పుడు హుజూర్‌నగర్‌లో ఘోరంగా చతికిలాపడిన తర్వాత తెలంగాణ బిజెపిలో కొత్త చర్చ మొదలైంది. అదే బిజెపి రాష్ట్ర అధ్యక్షుని మార్పు. ప్రస్తుత అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఢిల్లీకి వెళతారు. రాజ్యసభ టికెట్‌ ఇస్తారు. రాష్ట్ర అధ్యక్షునిగా […]

జేజమ్మకే జై.. త్వరలో బిజెపి పగ్గాలు !
Follow us on
ఎన్నికలొచ్చే దాకా ఊదరగొట్టడం.. ఎన్నికల్లో చతికిలా పడడం.. అడపాదడపా ఢిల్లీ నేతల పుణ్యం వల్లో.. టిడిపి లాంటి పార్టీతో పొత్తుల వల్లో ఒకటో అరో సీట్లు గెల్చుకోవడం.. ఇదీ తెలంగాణా బిజెపి అనగానే మనకు అనిపించేది.. పలు నోళ్ళలో వినిపించేది. అయితే.. ఇప్పుడు హుజూర్‌నగర్‌లో ఘోరంగా చతికిలాపడిన తర్వాత తెలంగాణ బిజెపిలో కొత్త చర్చ మొదలైంది.
అదే బిజెపి రాష్ట్ర అధ్యక్షుని మార్పు. ప్రస్తుత అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఢిల్లీకి వెళతారు. రాజ్యసభ టికెట్‌ ఇస్తారు. రాష్ట్ర అధ్యక్షునిగా కొత్త వారికి చాన్స్‌ ఇస్తారు. తెలంగాణ బీజేపీ ఆఫీసులో వినిపిస్తున్న మాటలు ఇవి. అయితే మాకే మళ్లీ అవకాశం అంటోంది పాత బ్యాచ్‌. కొత్త, పాత నేతల మధ్య ఫైట్‌లో తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు? అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. ఇంతకీ ఎవరో తెలుసుకోవాలంటే రీడ్ దిస్ స్టోరీ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి కొందరు నేతలు జంప్‌ అయ్యారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేశారు.  కొందరు నేతలు టికెట్‌ రాకపోయినా…..కూల్‌గా పార్టీలో సెటిల్‌ అయిపోయారు. తెలంగాణ బీజేపీలో పాత నేతల కంటే ఇప్పుడు ఎక్కువగా కొత్త నేతలే కన్పిస్తున్నారు.
మరోవైపు బీజేపీ సంస్థాగత ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి.
డిసెంబర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతోంది. వెంటనే పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను కూడా ప్రకటిస్తారు. దీంతో ఈ పదవి కోసం కొత్త, పాత నేతల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. సంస్థాగత పదవుల కోసం రెండు వర్గాల మధ్య భీకర పోరు జరుగుతోందని అభిఙ్ఞ వర్గాల భోగట్టా.
బీజేపీ అధ్యక్ష రేసులో ఇప్పటికే పలువురి పేర్లు విన్పిస్తున్నాయి. లక్ష్మణ్‌కు మరోసారి చాన్స్‌ ఇస్తారని పాత నేతలు చెబుతుంటే….కొత్త వారికి చాన్స్‌ ఇస్తారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. మాజీ మంత్రి డీకే అరుణ ఈ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాంమాధవ్‌ ద్వారా బీజేపీలో చేరిన డీకే అరుణ…అమిత్‌షాతో పాటు ఢిల్లీలోని బీజేపీ పెద్దలకు రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నారట. ఇప్పటికే అధ్యక్ష పదవికి డీకే పేరును కొంతమంది అధిష్టానానికి సిఫార్సు చేశారట. ఇప్పటికే డీకేకు పదవి ఇప్పించేందుకు ఢిల్లీలో కీలక నేతలు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.
ఇటు డికే అరుణ కార్యకర్తలు కూడా…తమ జేజమ్మకు ఏదో ఒక పదవి వస్తుందనే ఆశలో ఉన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఉత్తర తెలంగాణలో బీజేపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. దీంతో దక్షిణ తెలంగాణకు అధ్యక్ష పదవి ఇస్తే…ఇక్కడ పార్టీ విస్తరణకు అవకాశం ఉంటుందనేది హైకమాండ్‌ ఆలోచనగా తెలుస్తోంది.
చేరిక‌ల‌తో పార్టీ బలపడుతుందని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. కానీ పదవుల విషయం వచ్చేసరికి కొత్త నేతలు వర్సెస్‌ పాత నేతలుగా ఫైట్‌ మారుతోంది.  అఇయతే పాత నాయ‌క‌త్వాన్ని కోన‌సాగిస్తారో లేక కొత్త నాయ‌క‌త్వానికి పెద్దపీట వేస్తారో? అధిష్టానం మ‌దిలో ఎం ఉందో ? అనేది మరో నెలరోజుల్లో తేలబోతుంది.