వైఎస్‌ జగన్‌ను కలిసిన కొత్తపల్లి సుబ్బారాయుడు

టీడీపీ కీలకనేత, కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి కొత్తపల్లి సుబ్బారాయుడు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే అతను వైసీపీ చేరుతారని వస్తున్న వార్తలు నిజమేనని తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో కొత్తపల్లి భేటీ అయ్యారు. సుమారు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో పలు విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. “జగన్‌తో అన్ని విషయాలు చర్చించడం జరిగింది. జగన్‌తో ఏకాభిప్రాయం కుదిరింది. మంచి ఆలోచన తీసుకోవడం […]

వైఎస్‌ జగన్‌ను కలిసిన కొత్తపల్లి సుబ్బారాయుడు

Edited By:

Updated on: Mar 24, 2019 | 1:39 PM

టీడీపీ కీలకనేత, కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి కొత్తపల్లి సుబ్బారాయుడు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే అతను వైసీపీ చేరుతారని వస్తున్న వార్తలు నిజమేనని తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో కొత్తపల్లి భేటీ అయ్యారు. సుమారు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో పలు విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. “జగన్‌తో అన్ని విషయాలు చర్చించడం జరిగింది. జగన్‌తో ఏకాభిప్రాయం కుదిరింది. మంచి ఆలోచన తీసుకోవడం జరిగింది. మా నాయకులకు, కార్యకర్తలకు మరోసారి జగన్- నేను తీసుకున్న నిర్ణయం తెలుపుతాను. నా నిర్ణయం కార్యర్తలు, అభిమానుల మధ్యలోనే చెబుతాను” అని కొత్తపల్లి స్పష్టం చేశారు.