లోక్‌సభ ఎన్నికలకు కేటీఆర్ సరికొత్త నినాదం

| Edited By:

Mar 27, 2019 | 6:15 PM

హైదరాబాద్: టీఆర్ఎస్ అనేది తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ సొంత పార్టీ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 16 మంది ఎంపీ స్థానాలను మనం గెలుచుకుంటే రేపటి రోజున మన కేసీఆర్ గారికి ఢిల్లీలో బలం ఉంటదని, మన హక్కులను రాబట్టుకోవచ్చని అన్నారు. మన నినాదం ఈనాడు ఒక్కటేనని, “సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు” అని కేటీఆర్ చెప్పారు. ఈ ఒక్క నినాదంతోనే ఎన్నికలకు వెళదామని అన్నారు. వ్యవసాయానికి 24 గంటలు వచ్చింది. […]

లోక్‌సభ ఎన్నికలకు కేటీఆర్ సరికొత్త నినాదం
Follow us on

హైదరాబాద్: టీఆర్ఎస్ అనేది తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ సొంత పార్టీ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 16 మంది ఎంపీ స్థానాలను మనం గెలుచుకుంటే రేపటి రోజున మన కేసీఆర్ గారికి ఢిల్లీలో బలం ఉంటదని, మన హక్కులను రాబట్టుకోవచ్చని అన్నారు. మన నినాదం ఈనాడు ఒక్కటేనని, “సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు” అని కేటీఆర్ చెప్పారు. ఈ ఒక్క నినాదంతోనే ఎన్నికలకు వెళదామని అన్నారు.

వ్యవసాయానికి 24 గంటలు వచ్చింది. ఇంటింటికీ తాగు నీరు వచ్చింది. 20 వేలకు పైగా చెరువులను బాగు చేసుకున్నాం. రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎదురు పెట్టుబడి ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. జై కిసాన్ అనేది ఇతర పార్టీలకు ఒక నినాదం అయితే టీఆర్ఎస్‌కు అదొక విధానం అని అన్నారు. ఇల్లు కట్టిస్తా, పెళ్లీ నేనే చేస్తా అన్న నాయకుడు కేసీఆర్. మన రైతు బంధును పీఎం కిసాన్ అనే పేరుతో మోడీ పెట్టుకున్నారు. చంద్రబాబు అన్నదాత సుఖీభవ అని పెట్టుకున్నారు. వరంగల్ నుంచి హైదరాబాద్ వరకూ పారిశ్రామిక క్యారిడార్‌ను అభివృద్ధి చేసే బాధ్యత కేసీఆర్ సర్కార్‌దే.