8న వికారాబాద్‌లో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 8న వికారాబాద్‌లో నిర్వహించనున్న చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొనే సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. బహిరంగసభ ఏర్పాట్లపై బుధవారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతృత్వంలో జరిగిన సమావేశంలో చేవెళ్ల లోకసభ అభ్యర్థి డాక్టర్‌ గడ్డం రంజిత్‌ రెడ్డితో పాటు పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ఎన్నికల ఇన్‌చార్జిలు పాల్గొన్నారు. బహిరంగసభ ఇన్‌చార్జిలుగా నియమితులైన […]

8న వికారాబాద్‌లో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ

Edited By:

Updated on: Apr 04, 2019 | 11:22 AM

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 8న వికారాబాద్‌లో నిర్వహించనున్న చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొనే సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. బహిరంగసభ ఏర్పాట్లపై బుధవారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతృత్వంలో జరిగిన సమావేశంలో చేవెళ్ల లోకసభ అభ్యర్థి డాక్టర్‌ గడ్డం రంజిత్‌ రెడ్డితో పాటు పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ఎన్నికల ఇన్‌చార్జిలు పాల్గొన్నారు. బహిరంగసభ ఇన్‌చార్జిలుగా నియమితులైన మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గ్యాదరి బాలమల్లు, కర్నె ప్రభాకర్‌, గట్టు రామచందర్‌ రావు, కరిమెల బాబూ రావు, పర్యాద కృష్ణమూర్తి, పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, తీగల కృష్ణా రెడ్డిలతో పాటు లోకసభ నియోజకవర్గం పరిధి శాసనసభ్యులు కాలె యాదయ్య, ప్రకాష్‌ గౌడ్‌, గాంధీ, మహేష్‌ రెడ్డి, డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, మాజీ మంత్రి పి.మహేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రచార సభ ఏర్పాట్లను స్థానిక శాసనసభ్యుడు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌తో పాటు గ్యాదరి బాలమల్లు, బొంతు రామ్మోహన్‌లు పర్యవేక్షించనున్నారు. భారీ సంఖ్యలో జన సమీకరణతోపాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగుకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రధానంగా అవసరమైన మేరకు తాగు నీరు, మజ్జిగ ప్యాకెట్‌లు అందుబాటులో ఉంచాలని తీర్మానించారు. పోలీసుల సమన్వయంతో పార్కింగ్‌ ఏర్పాట్లు చేయాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు.