ఫైర్ బ్రాండ్ వీర శివారెడ్డి దారెటు…

కడప రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న నేత వీర శివారెడ్డి. కమలాపురం మాజీ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించిన వీరశివారెడ్డికి పార్టీ అధిష్టానం మొండి చేయి చూపించింది. ప్రొద్దుటూరు టికెట్ ఇచ్చినా సరిపెట్టుకుంటానని ప్రాధేయపడినా లాభం లేకపోయింది. దీంతో విసిగిపోయిన వీరశివుడు సరిగ్గా పోలింగ్ రోజు ప్లేట్ ఫిరాయించి వైసీపీకి జై కొట్టారు. ఎన్నికల్లో గెలిచి వైసీపీ అధికారంలోకి రావడంతో తన మెడలో వీరతాడు వేస్తారని భావించారట. కమలాపురం ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ […]

ఫైర్ బ్రాండ్ వీర శివారెడ్డి దారెటు...
Follow us

| Edited By:

Updated on: Sep 22, 2019 | 10:00 PM

కడప రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న నేత వీర శివారెడ్డి. కమలాపురం మాజీ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించిన వీరశివారెడ్డికి పార్టీ అధిష్టానం మొండి చేయి చూపించింది. ప్రొద్దుటూరు టికెట్ ఇచ్చినా సరిపెట్టుకుంటానని ప్రాధేయపడినా లాభం లేకపోయింది. దీంతో విసిగిపోయిన వీరశివుడు సరిగ్గా పోలింగ్ రోజు ప్లేట్ ఫిరాయించి వైసీపీకి జై కొట్టారు. ఎన్నికల్లో గెలిచి వైసీపీ అధికారంలోకి రావడంతో తన మెడలో వీరతాడు వేస్తారని భావించారట.

కమలాపురం ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి, ఎంపీగా గెలిచిన జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి, ఫలితాలు వెలువడ్డాక తన ఇంటికి వచ్చి ధన్యవాదాలు తెలపడంతో వీరశివారెడ్డి చాలా సంబరపడిపోయారట. తన రాజకీయ భవిష్యత్ ఎలా ఉన్నా తన కుమారుడి ఫ్యూచర్ బావుంటుందని భావించారట. దీంతో టీడీపీకి తాను గుడ్ బై చెప్తున్నానని, వై ఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటానని ప్రకటించారట. అయితే రోజులు గడుస్తున్నా వైపీసీనుంచి పాజిటివ్ సిగ్నల్స్ రాకపోవడంతో వీర శివారెడ్డికి ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందట.

తనయుడి రాజకీయ భవిష్యత్ కోసం ఒక మెట్టు కిందకు దిగి వైసీపీలో చేరాలనుకుంటే అటువైపునుంచి సానుకూల సంకేతాలు రాకపోగా.. ఎన్నికలకు ముందు తన వద్దకు వచ్చి తన మద్దతు కోరిన నేతలు కూడా మొహం చాటేసారట. స్వయంగా జగన్ అపాయింట్ మెంట్ కోసం చేసిన యత్నాలు కూడా ఫలించకపోవడంతో వీరశివుడు డైలమాలో పడ్డారట.

అంతేకాకుండా డీసీసీబీ చైర్మన్ గా కాలపరిమితి ముగిసిన తన కుమారుడు అనిల్ కుమార్ రెడ్డికి సొసైటీ ఎన్నికలు జరిగే వరకూ కొనసాగింపు ఇస్తారని ఆశించారట. అయితే జగన్ ఈ విషయంలో కూడా వీర శివుడికి ఝలక్ ఇచ్చారట. దీంతో రాజకీయంగా ఎదగాలంటే ఏదో ఒక పార్టీ అండ ఉండాలని భావించి, కమలం గూటికి వెళ్లాలని భావిస్తున్నారట వీరశివారెడ్డి.

జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా వీరశివుడు సీఎం రమేశ్ ను కలిశారట. ఈ సంర్భంగా పార్టీలోకి వస్తే మంచి భవిష్యత్ ఉంటుందని సీఎం రమేశ్ చెప్పారట. వీర శివుడు ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించారట. త్వరలో కమలం కండువా కప్పుకుంటానని వీర శివుడు తన అనుచరులతో చెప్పారట. ఏదేమైనా వీరశివారెడ్డి బీజేపీలో చేరడం ఖాయమన్న ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..