Tadipatri Municipality: తాడిపత్రిలో పసుపు జెండా ఎగరేసిన జేసీ.. పొలిటికల్ హైటెన్షన్ మధ్య క్రేజీ విక్టరీ

ఆంధ్రపదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఫోకస్ అంతా తాడిపత్రిపైనే ఉంది. రాష్ట్రమంతటా పత్తా లేకుండా పోయిన టీడీపీ.. ఇక్కడ మాత్రం ఉనికి చాటుకుంది.

Tadipatri Municipality: తాడిపత్రిలో పసుపు జెండా ఎగరేసిన జేసీ.. పొలిటికల్ హైటెన్షన్ మధ్య క్రేజీ విక్టరీ
Tadipatri Muncipality

Updated on: Mar 18, 2021 | 1:05 PM

ఆంధ్రపదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఫోకస్ అంతా తాడిపత్రిపైనే ఉంది. రాష్ట్రమంతటా పత్తా లేకుండా పోయిన టీడీపీ.. ఇక్కడ మాత్రం ఉనికి చాటుకుంది. ముఖ్యంగా జేసీ ఫ్యామిలీ ఈ ఎన్నికలను చాలా ప్రస్టేజ్‌గా తీసుకుంది. తాడిపత్రిలో అటు జేసీ ఫ్యామిలీ, ఇటు పెద్దారెడ్డి కుటుంబాల మధ్య హైటెన్షన్ వాతావరణం నడిచిన విషయం తెలిసిందే. సవాళ్లు, ప్రతిసవాళ్లు కూడా జరిగాయి. అయితే అనూహ్యం జేసీ కుటుంబం ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక్కడ మొత్తం వార్డులు 36 . టీడీపీ 18 వార్డుల్లో … వైసీపీ 16 వార్డుల్లో గెలిచాయి. సీపీఐ ఒక స్థానం.. ఇండిపెండెంట్‌ మరో స్థానం కైవసం చేసుకున్నాయి. ఎంపీ తలారి రంగయ్య , ఎమ్మెల్సే పెద్దారెడ్డి ఎక్స్‌ అఫిషియో ఓట్లతో వైసీపీ బలం 18కి చేరింది. గెలిచిన 18 మందితోపాటు సీపీఐ, స్వతంత్రుల మద్దతుతో  టీడీపీ ఇక్కడ పాగా వేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తన పార్టీ తరుఫున గెలిచినవారినందర్నీ క్యాంప్‌కు తీసుకెళ్లిన జేసీ వర్గం.. వారందర్నీ జాగ్రత్తగా కాపాడుకుంది. అయితే ఈ మున్సిపాలిటీని దక్కించుకునేందుకు వైసీపీ కూడా పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదనే చెప్పాలి. వైసీపీ కూడా ఇక్కడ పాగా వేయాలని భావిస్తే సీన్ వేరేలా ఉండేదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

గత రెండు, మూడు రోజులు తాడిపత్రిలో హైరేంజ్ పొలిటికల్ హీట్ నడిచింది. మొత్తానికి జేసీ ఫ్యామిలీ తమ ఉనికిని కాపాడుకుంది. గతంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. పట్టణంలో పెద్ద ఎత్తున చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు.. జగన్ వేవ్‌లో కూడా ఆయన్ను నిలబెట్టగలిగాయని చెబుతున్నారు.

Also Read:

TTD Kalyanamastu: బంగారం లాంటి వార్త చెప్పిన టీటీడీ.. వారికి గ్రాము కాదు, రెండు గ్రాముల గోల్డ్

Telangana News: ఒకే తాటిచెట్టుపై 17మంది ఎక్కారు… అరెరే ఏంటీ చిత్రం.. తెలుసుకుందాం పదండి

Loading...
Unable to load recommendations.
Follow Us