ఏపీ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్ గురించి ఇప్పుడు మీకు వివరించబోతున్నాం. మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో పాత మిత్రులు కలిశారు. పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ-జనసేన మధ్య అవగాహన కుదిరింది. దీంతో ఆచంట, వీరవాసరం MPPలు టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకున్నాయి. కలిసి పనిచేస్తున్నాయి. పరిషత్ ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు కలిసే బరిలోకి దిగాయి. అయితే పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం జనసేన టీడీపీకి మద్దతు ఇచ్చింది. ఇవాళ జరిగిన మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో రెండు పార్టీలు అవగాహనతో పనిచేశాయి. దీంతో ఆచంటలో MPPని తెలుగుదేశం గెల్చుకుంది. ఇక్కడ టీడీపీ-7, జనసేన- 4, వైసీపీ 6 చోట్ల విజయం సాధించాయి. జనసేన మద్దతుతో MPP టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. జనసేనకు వైస్ ఎంపీపీ, కోఆప్షన్ పదవులు దక్కాయి..
వీరవాసరంలో ఆసక్తికర రాజకీయం జరిగింది. అతి తక్కువ సీట్లు గెలిచిన TDPకి MPP దక్కింది. ఇక్కడ జనసేన-8, టీడీపీ-4 చోట్ల గెలుపొందాయి. వైసీపీ 7 చోట్ల విజయం సాధించింది. అయితే ఇక్కడ కూడా జనసేన మద్దతుతో టీడీపీకి చెందిన వీరవల్లి దుర్గాభవాని పరిషత్ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. ఎక్కువ సీట్లు గెల్చినప్పటికీ టీడీపీకే MPP ఇవ్వడంపై జనసేన వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: జడ్పీ ఛైర్మన్ల ఎన్నికకు వైసీపీ అభ్యర్థులను ఫైనల్ చేసిన సీఎం జగన్.. లిస్ట్ ఇదిగో