అసెంబ్లీ ముట్టడిస్తామన్న జనసేన.. రైతుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న నాదెండ్ల

అసెంబ్లీ సమావేశాల తొలిరేజే ఛలో అసెంబ్లీ నిర్వహిస్తామని జనసేన పార్టీ ప్రకటించింది. రైతు సమస్యలపై ఎలుగెత్తాలని పవన్ కల్యాణ్ ఆదేశించినట్లు ఆ పార్టీ..

అసెంబ్లీ ముట్టడిస్తామన్న జనసేన.. రైతుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న నాదెండ్ల
Follow us

|

Updated on: Feb 21, 2021 | 4:44 AM

అసెంబ్లీ సమావేశాల తొలిరేజే ఛలో అసెంబ్లీ నిర్వహిస్తామని జనసేన పార్టీ ప్రకటించింది. రైతు సమస్యలపై ఎలుగెత్తాలని పవన్ కల్యాణ్ ఆదేశించినట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రభుత్వం రైతులను వంచనకు గురిచేస్తోందని, సీఎం జగన్ కు రైతుల సమస్యలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని నాదెండ్ల విమర్శించారు. సీఎంకే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ్టి నీతి ఆయోగ్ సమావేశంలో నివర్ తుపాను నష్టాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటించి, రైతుల సమస్యలపై ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లపై కనీస స్పందన రాలేదని ఆరోపించారు. ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటుంటే… సీఎం అయ్యాక జగన్ ఒక్కసారైనా గ్రామాల్లో పర్యటించారా? అని నిలదీశారు. పాదయాత్రలో ఉన్నంత ఓర్పు సీఎం అయ్యాక జగన్ లో కనిపించడం లేదని నాదెండ్ల విమర్శించారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో స్థానిక ఎన్నికలు పూర్తయ్యాక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని భావిస్తున్నారు. బహుశా మార్చి 14 తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read more:

నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్‌.. ప్రత్యేక హోదీ ఇవ్వాలని కోరిన ఏపీ ముఖ్యమంత్రి