తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై సీ ఓటర్ సర్వే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలో సైకిల్‌కే ఆధిక్యం దక్కే అకాశాలున్నట్టు సర్వే వెల్లడించింది. 37.4శాతం ఓట్లతో టీడీపీకి 14 సీట్లు దక్కే అవకాశాలున్నాయి. 35.3 శాతం ఓట్లతో వైసీపీకి 11 సీట్లుదక్కే అవకాశాలున్నాయని పేర్కొంది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మజ్లిస్‌తో కలిసి టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేయబోతున్నట్లు సర్వే తేల్చింది. తెలంగాణలో టీఆర్ఎస్‌కు 16, మజ్లిస్‌కు ఒక్క సీటు దర్కబోతున్నట్లు వెల్లడించింది. 31.7 శాతం ఓట్లు సాధించినప్పటికీ కాంగ్రెస్‌కు ఒక్కసీటు కూడా ద్కే అవకాశం లేదని సర్వే అంచనా వేసింది.