టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదుకు ఇంచార్జ్‌లు ఖరారు.. ఏయే జిల్లాకు ఇంచార్జ్ ఎవరో తెలుసా..?

|

Feb 08, 2021 | 2:53 PM

టీఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశంలో ఈ నెల 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే..

టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదుకు ఇంచార్జ్‌లు ఖరారు.. ఏయే జిల్లాకు ఇంచార్జ్ ఎవరో తెలుసా..?
Follow us on

టీఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశంలో ఈ నెల 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఒక్కో ఎమ్మెల్యే కనీసం 50 వేల సభ్యత్వాలు చేపట్టాలని కేసీఆర్‌ ఆదేశించారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించేందుకు పార్టీ అధిష్టానం జిల్లాల వారీగా ఇంచార్జిలను నియమించింది.

పార్టీ కార్యదర్శులు జిల్లాల సభ్యత్వ నమోదు ఇంచార్జిలుగా వ్యవహరిస్తారని తెలిపింది. రెండు లేదా మూడేసి జిల్లాలకు పార్టీ ప్రధాన కార్యదర్శులు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్‌ వంటి దూరప్రాంత జిల్లాలకు చెందిన బాధ్యులకు ఇప్పటికే సభ్యత్వ నమోదు పుస్తకాలను అందజేశారు. మిగతా జిల్లాలకు ఈ నెల 12 లోగా సభ్యత్వ నమోదు పుస్తకాలు చేరవేసేందుకు చర్యలు చేపట్టారు.

జిల్లాల వారీగా అరిగెల చూస్తే నాగేశ్వర్‌రావు (ఆదిలాబాద్‌), లోక భూమారెడ్డి (నిర్మల్‌, ఫారూక్‌ హుస్సేన్‌ (ఆసిఫాబాద్‌), గూడూరు ప్రవీణ్‌ (మంచిర్యాల), ముజీబుద్దీన్‌ (నిజామాబాద్‌), డి.విఠల్‌రావు (కామారెడ్డి), కోలేటి దామోదర్‌ (కరీంనగర్‌), లోక బాపురెడ్డి (పెద్దపల్లి), కర్ర శ్రీహరి (రాజన్న సిరిసిల్ల), భానుప్రసాద్‌ (జగిత్యాల) సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా పనిచేస్తారు.

వీరితో పాటు రాధాకృష్ణ శర్మ (మెదక్‌), బక్కి వెంకటయ్య (సంగారెడ్డి), ఫరీదుద్దీన్‌ (సిద్దిపేట), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (ములుగు, భూపాలపల్లి), లింగంపల్లి కిషన్‌రావు (మహబూబాబాద్‌), మాలోత్‌ కవిత (జనగాం), వై.కృష్ణారెడ్డి (వరంగల్‌ అర్బన్‌), మెట్టు శ్రీనివాస్‌ (వరంగల్‌ రూరల్‌), వెంకటరత్నం బాబు (ఖమ్మం), తాతా మధు (కొత్తగూడెం) ఇంచార్జిలుగా వ్యవహరిస్తారు.

అలాగే బడుగుల లింగయ్య యాదవ్‌ (నల్లగొండ), రామకృష్ణారెడ్డి (సూర్యాపేట), వై.వెంకటేశ్వర్లు (యాదాద్రి), గట్టు రామచందర్‌రావు (రంగారెడ్డి), జహంగీర్‌పాషా (వికారాబాద్‌), రాంబాబు యాదవ్‌ (మేడ్చల్‌), శంభీపూర్‌ రాజు (హైదరాబాద్‌), నాగేందర్‌ గౌడ్‌ (మహబూబ్‌నగర్‌), అందె బాబయ్య (నారాయణపేట), బి.శ్రీనివాస్‌ యాదవ్‌ (గద్వాల), వాల్యా నాయక్‌ (నాగర్‌కర్నూలు), ఇంతియాజ్‌ (వనపర్తి) కూడా సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా పనిచేస్తారు.

ఇక పార్టీ ప్రధాన కార్యదర్శులు వి.గంగాధర్‌గౌడ్, సత్య వతి రాథోడ్, ఎం.సుధీర్‌రెడ్డి, బసవరాజు సారయ్య, బండి రమేశ్, బి.వెంకటేశ్వర్లు, నారదాసు లక్ష్మణ్‌రావు, జి.బాలమల్లు, నూకల నరేశ్‌రెడ్డి, తక్కల్లపల్లి రవీందర్‌రావు, పి.రాములు, ఆర్‌.శ్రావణ్‌రెడ్డి, నరేంద్రనాథ్, బండా ప్రకాశ్, భరత్‌ కుమార్‌ గుప్తా రెండు లేదా మూడు జిల్లాలకు సభ్యత్వ నమోదు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారని టీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రకటించింది.

 

Read more:

గ్రేటర్‌ పీఠంపై అందరి కళ్లు దారుస్సలాం వైపే.. ఈ నెల 11న మజ్లీస్‌ పార్టీ కీలక సమావేశం

కోడెల శివప్రసాదరావు కుమారుడికి లిక్కర్‌ డబ్బులు లేవా..? పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత