ఏపీలో పార్టీల మధ్య ఊపందుకున్న వలసలు

ఎన్నికలు సమయం దగ్గర పడుతుండటంతో ఏపీలో పార్టీల మధ్య నాయకుల వలసలు ఊపందుకున్నాయి. వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కీలక నేతలు టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న కోట్ల కుటుంబం, వైసీపీకి బలమైన సపోర్ట్ గా ఉన్న గౌరు ఫ్యామిలీ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇవాళ టీడీపీలో చేరనుండగా.. ఇప్పటికే వైసీపీకి గుడ్ బై […]

ఏపీలో పార్టీల మధ్య ఊపందుకున్న వలసలు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:26 PM

ఎన్నికలు సమయం దగ్గర పడుతుండటంతో ఏపీలో పార్టీల మధ్య నాయకుల వలసలు ఊపందుకున్నాయి. వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కీలక నేతలు టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న కోట్ల కుటుంబం, వైసీపీకి బలమైన సపోర్ట్ గా ఉన్న గౌరు ఫ్యామిలీ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇవాళ టీడీపీలో చేరనుండగా.. ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పిన గౌరు దంపతులు టీడీపీ అధినేతతో అమరావతిలో భేటీ కానున్నారు

రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పార్టీని వీడని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పలు సందర్భాల్లో పార్టీకి అండగా నిలిచారు. కానీ.. మారిన రాజకీయ పరిస్థితుల్లో మనసు మార్చుకున్నారు కోట్ల. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇవాళ టీడీపీలో చేరనున్నారు. కాంగ్రెస్ నేతగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత.. తమ పార్టీలోకి రావడం అదనపు బలమే అని అంచనా వేస్తోంది టీడీపీ.

ఇక పార్టీ ఏర్పాటైన దగ్గర నుంచి వైసీపీలో కొనసాగిన గౌరు కుటుంబం కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయింది. ఈ నెల 9న పసుపు కండువా కప్పుకుంటామని గౌరు దంపతులు ఇప్పటికే ప్రకటించారు. వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం నిన్న కర్నూల్లో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తిని కలిశారు. ఇవాళ అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. అయితే వైఎస్ కుటుంబంతో బంధం తెంచుకుంటామని తాము ఎప్పుడూ అనుకోలేదని గౌరు వెంకటరెడ్డి, గౌరు చరిత అన్నారు. మొదటి నుంచీ తాము పార్టీకి విధేయులుగా ఉన్నామనీ.. కానీ 10 నెలలుగా పార్టీలో తమను నిర్లక్ష్యం చేస్తున్నారని గౌరు దంపతులు ఆరోపించారు. పాణ్యం టికెట్ ఇవ్వలేనని చెప్పడంతో తాము వైసీపీని వీడుతున్నామని తెలిపారు. వైఎస్ఆర్లో ఉన్న భరోసా జగన్ దగ్గర కనపడలేదని ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో