Huzurabad By Election: అప్పుడు ఆయన గెలిస్తే అభివృద్ధి జరిగిందా.. హుజూరాబాద్‌ ప్రజలకు మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం..

రెండేళ్ల కిందట బండి సంజయ్‌ గెలిస్తే జరగని అభివృద్ధి.. ఇప్పుడు ఈటల గెలిస్తే జరుగుతుందా అని ప్రశ్నించారు మంత్రి హరీష్‌రావు. గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.

Huzurabad By Election: అప్పుడు ఆయన గెలిస్తే అభివృద్ధి జరిగిందా.. హుజూరాబాద్‌ ప్రజలకు మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం..
Harish Rao

Updated on: Oct 09, 2021 | 2:02 PM

రెండేళ్ల కిందట బండి సంజయ్‌ గెలిస్తే జరగని అభివృద్ధి.. ఇప్పుడు ఈటల గెలిస్తే జరుగుతుందా అని ప్రశ్నించారు మంత్రి హరీష్‌రావు. గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు హరీష్‌ రావు.  పెట్రోల్ డిజిల్, గ్యాస్ ధరలు పెంచే బీజేపీ కావాలా.. కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్ ఇచ్చే టీఆర్ఎస్ కావాలా అంటూ ప్రశ్నించారు. పెట్రోల్ – డిజీల్ ధరలు పెంచిన బీజేపీకి- ఓటుతోనే గుణపాఠం చెప్పాలన్నారు.  గ్యాస్ ధరను పెంచిన బీజేపీని – పాతర్లపల్లిలో పాతరేయాలంటూ వివమర్శల దాడిని పెంచారు. కళ్యాణ లక్ష్మి ప్రారంభంమైంది దళితులతోనే అని ఆ తర్వాత అందరికీ దళితు బందు .. దళితులతో ప్రారంభం అయ్యిందన్నారు. ఈటల రాజేంద్రను పెంచి పెద్ద చేసింది కేసీఆర్.. నా తమ్ముడు అంటూ ఆకాశానికి పైకెత్తిండు.. కాని ఈటల ఏం చేసిండు.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు చేశాడు.. ఈటల రాజేందర్‌కు మీరే బుద్ది చెప్పాలని విమర్శించారు.

ఇక గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు 13 మంది హుజూరాబాద్‌ బైపోల్‌ ఫైట్‌లో ఉండగా..43మంది ఇండిపెండెంట్లతో పాటు మొత్తం 61 మంది 92 సెట్ల నామినేషన్స్‌ వేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపధ్యంలో ఈ నెల 30వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నియోజక వర్గం పరిధిలో నివసించే వారికి ఇది వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. నెగోషియబుల్ ఇన్ స్ర్టుమెంటల్ యాక్ట్1881 ప్రకారం పబ్లిక్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి: Huzurabad By Election: మరింత హీటెక్కిన హుజురాబాద్.. రాజేందర్‌ పేరుతో నాలుగు నామినేషన్లు..

CM Jagan: ప్రధాని గారు.. విద్యుత్‌ ధరలపై చర్యలు తీసుకోండి.. మోడీకి లేఖ రాసిన సీఎం జగన్..

Facebook Apologised: అంతరాయానికి చింతిస్తున్నాం.. మరోసారి సారీ.. చెప్పిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్..

Beer: బీరు ప్రియులకు చేదువార్త.. 27 వేల 264 బాటిల్స్ బీరును పారబోసారు.. ఎందుకో తెలుసా..