Himanta Biswa sharma: ‘టుక్డే తుక్డే ఫిలాసఫీ’కి దేశాన్ని తాకట్టు పెట్టలేం.. రాహుల్ తీరుపై విరుచుకుపడ్డ అసోం సీఎం

|

Feb 11, 2022 | 8:39 AM

'టుక్డే తుక్డే ఫిలాసఫీ'కి దేశాన్ని తాకట్టు పెట్టలేమని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ(Himanta Biswa sharma) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi )పై తీవ్ర స్థాయిలో...

Himanta Biswa sharma: టుక్డే తుక్డే ఫిలాసఫీకి దేశాన్ని తాకట్టు పెట్టలేం.. రాహుల్ తీరుపై విరుచుకుపడ్డ అసోం సీఎం
Himantha
Follow us on

‘టుక్డే తుక్డే ఫిలాసఫీ’కి దేశాన్ని తాకట్టు పెట్టలేమని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ(Himanta Biswa sharma) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi )పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. “దేశం, జాతీయత, జాతీయవాదంతో సమస్య ఏమిటి..?” అని ప్రశ్నించారు. భారతదేశం యూనియన్‌ కాదని, యూనియన్ కు మించినదని స్పష్టం చేశారు. “హలో- బెంగాల్ దాటి, ఈశాన్య భారతంలో మేము ఉన్నామని” ఉద్ఘాటించారు. బీజేపీకి మళ్లీ ఓటు వేయకుంటే ఉత్తరప్రదేశ్‌ కశ్మీర్‌, కేరళ లేదా బెంగాల్‌గా మారుతుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీపై శర్మ ఈ విమర్శలు చేశారు. కశ్మీర్ నుంచి కేరళ వరకు, గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు భారతదేశం సమైక్యంగా ఉంది. దేశ స్ఫూర్తిని అవమానించడం సరికాదని హితవు పలికారు.

“భారతదేశం యూనియన్‌కు మించినది. మీ టుక్డే తుక్డే తత్వానికి భారత్‌ను బందీగా ఉంచలేరు. దేశం, జాతీయత మరియు జాతీయ వాదంతో మీ సమస్య ఏమిటి.? హలో- బెంగాల్‌కు ఆవల మేము ఈశాన్య ప్రాంతంలో ఉన్నాం. మా యూనియన్‌లో బలం ఉంది. మన సంస్కృతుల సమాఖ్య, మన వైవిధ్యాల యూనియన్, మన భాషల యూనియన్, మన రాష్ట్రాల సమాఖ్య అన్ని రంగుల్లో అందంగా ఉంది. భారతదేశం యొక్క ఆత్మను అవమానించవద్దు”

                                          – హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి

మరోవైపు కేరళపై ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తీవ్రంగా ఖండించారు. ఉత్తరప్రదేశ్‌ కూడా కేరళలాగా అభివృద్ధి చెందితే ప్రజలకు శాంతిభద్రతలు, మెరుగైన జీవన పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

        యోగి ఆదిత్యనాథ్ భయపడుతున్నట్లుగా యూపీ కేరళగా మారితే ఉత్తమ విద్య, ఆరోగ్య సేవలు, సామాజిక సంక్షేమం, జీవన ప్రమాణాలు ఇలా అన్ని రంగాల్లో ఆరాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మతం, కులం పేరుతో ప్రజలను హత్య చేయని సామరస్య సమాజంలో వారి జీవనం సాగుతుంది. సుశాంతి, సుస్థిరత, మెరుగైన జీవన ప్రమాణాలను యూపీ ప్రజలు కోరుకుంటున్నారు. 

                                           – పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి

ఇవీ చదవండి..

IND vs WI 3rd ODI: నేడు భారత్, వెస్టిండీస్ మధ్య మూడో వన్డే.. జట్టులో స్వల్ప మార్పులు..

Airtel Xstream Premium: ఎయిర్‌టెల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. రూ.149కే 15 ఓటీటీ వీడియో స్ట్రీమింగ్‌ సేవలు

Rajinikanth: సెన్సేషనల్‌ డైరెక్టర్‌తో కొత్త సినిమాను షురూ చేసిన తలైవా.. 169వ సినిమా అఫీషియల్‌..