
క్రికెటర్, బీజేపీ అభ్యర్థి గౌతం గంభీర్ రెండు ఓటరు గుర్తింపు కార్డులను కలిగి ఉన్నారని ఆప్ చేసిన ఆరోపణలు తెలిసిందే. అయితే ఆప్ అభ్యర్థి అతిషి చేస్తున్న ఆరోపణలను గంభీర్ తోసిపుచ్చాడు. ఆమె చెప్పినట్లు తనకు రెండు ఓటర్ ఐడీ కార్డులు లేవని గౌతం స్పష్టం చేశారు. తనకు రాజేంద్రనగర్ ప్రాంతం నుంచి ఓకే ఒక ఓటర్ ఐడీ కార్డు ఉందని, వేరే ఎక్కడ ఓటర్ ఐడీ లేదని గంభీర్ తేల్చి చెప్పాడు.