కాంగ్రెస్ గెలిస్తే పాకిస్థాన్‌లో దీపావళే.. గుజరాత్ సీఎం సంచలన వ్యాఖ్యలు

| Edited By:

Mar 25, 2019 | 7:40 PM

గాంధీ నగర్ : ఎన్నికల వేళ విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ‘విజయ్ సంకల్ప్’ ర్యాలీలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మాట్లాడుతూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కనుక పొరపాటున గెలిస్తే…పాకిస్థాన్‌లో దీపావళి వేడుకలు జరుపుకుంటారని, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 23న వెలువడే లోక్ సభ ఫలితాల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆ రోజు పాకిస్థాన్ లో […]

కాంగ్రెస్ గెలిస్తే పాకిస్థాన్‌లో దీపావళే.. గుజరాత్ సీఎం సంచలన వ్యాఖ్యలు
Follow us on

గాంధీ నగర్ : ఎన్నికల వేళ విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ‘విజయ్ సంకల్ప్’ ర్యాలీలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మాట్లాడుతూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కనుక పొరపాటున గెలిస్తే…పాకిస్థాన్‌లో దీపావళి వేడుకలు జరుపుకుంటారని, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 23న వెలువడే లోక్ సభ ఫలితాల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆ రోజు పాకిస్థాన్ లో దీపావళి జరుగుతుందని, ఎందుకంటే వారంతా ఒకే గూటికి చెందిన పక్షులని విమర్శించారు.

మెహ్సనాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో విజయ్ రూపానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల శ్యామ్ పిట్రోడా బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై దాడులను ప్రశ్నించిన నేపథ్యంలో విజయ్ రూపానీ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ గెలిస్తే మాత్రం పాకిస్థాన్‌కు గట్టి సమాధానం చెప్పినట్లు అవుతుందని రూపానీ అభిప్రాయపడ్డారు. ప్రపంచం మొత్తానికి పాకిస్థాన్ ఉగ్రవాద దేశంగా తెలుసని, కానీ శ్యామ్ పిట్రోడా, రాహుల్ గాంధీలకు మాత్రం పాకిస్థాన్ ఉగ్రవాద దేశంగా కనిపించడంలేదని విమర్శించారు. అలాగే కాంగ్రెస్ వారు సైనికుల త్యాగాలను సైతం ప్రశ్నిస్తున్నారని, ఓట్ బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.