ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.. ఆరోపణలు.. ప్రత్యారోపణల మధ్య కొనసాగుతోంది. మీరు తప్పు చేశారంటే.. మీరు చేశారని.. విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ సందర్భంలోనే.. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను.. ఏపీ స్పీకర్ సస్పెండ్ చేయడం.. ఏకంగా ప్రతిపక్షనేత చంద్రబాబు వాకౌట్ చేయడం.. తీవ్ర సంచలనానికి దారితీసింది.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. మహిళలకు 45 ఏళ్లకే పింఛన్ అని చెప్పి.. ఇప్పుడు వెనక్కి తగ్గారన్నారు. వైసీపీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణిలో.. ముందుకెళ్తే.. కాలగర్భంలో కలిసిపోవటం తప్పదని హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేను.. ముఖ్యమంత్రి సైతం కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇదే.. ముందు ముందు మీకే దెబ్బకొడుతుందని విమర్శించారు. రాష్ట్రమంతా స్తంభించి పోయింది.. 5 ఏళ్లలోశాసన సభలో మార్షల్స్ అసెంబ్లీలో అడుగుపెట్టిన పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప ఫ్యాక్షన్ రాజకీయాలను.. అసెంబ్లీలోకి తీసుకు రావొద్దని వైసీపీ ప్రభుత్వానికి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు.