కాంగ్రెస్ కాదంది… బీజేపీ రమ్మంది

ఎన్నికల వేళ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఢిల్లీలోని గోండా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే భిషమ్ శర్మను కాంగ్రెస్‌ పార్టీ నుంచి తొలగించారు. అయితే ఆయన మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ‘‘పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో వాయుసేన జరిపిన సర్జికల్ దాడులపై కాంగ్రెస్ నేతలు ఆధారాలు కోరడం చాలా బాధించింది. బీజేపీ పాలనకు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనకు ఆకర్షితుడినయ్యే బీజేపీలో […]

కాంగ్రెస్ కాదంది... బీజేపీ రమ్మంది

Edited By:

Updated on: May 01, 2019 | 5:20 PM

ఎన్నికల వేళ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఢిల్లీలోని గోండా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే భిషమ్ శర్మను కాంగ్రెస్‌ పార్టీ నుంచి తొలగించారు. అయితే ఆయన మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.

‘‘పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో వాయుసేన జరిపిన సర్జికల్ దాడులపై కాంగ్రెస్ నేతలు ఆధారాలు కోరడం చాలా బాధించింది. బీజేపీ పాలనకు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనకు ఆకర్షితుడినయ్యే బీజేపీలో చేరాను’’ అని పార్టీలో చేరిన అనంతరం శర్మ పేర్కొన్నారు.