AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికల ముందు టీడీపీకి మరో ఎదురుదెబ్బ

కడప:  సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆంధ్రప్రదేశ్ లోని అధికార తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి.. కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ రాజీనామా చేశారు. దీంతో కడప జిల్లాలో టీడీపీకి పెద్ద షాక్ తగిలినట్లే అని తెలుస్తోంది. కాగా గతంలో రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించిన సాయి ప్రతాప్.. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇకపోతే దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి బాగా సన్నిహితుడైన సాయి ప్రతాప్.. […]

ఎన్నికల ముందు టీడీపీకి మరో ఎదురుదెబ్బ
Ravi Kiran
|

Updated on: Mar 30, 2019 | 3:17 PM

Share

కడప:  సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆంధ్రప్రదేశ్ లోని అధికార తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి.. కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ రాజీనామా చేశారు. దీంతో కడప జిల్లాలో టీడీపీకి పెద్ద షాక్ తగిలినట్లే అని తెలుస్తోంది. కాగా గతంలో రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించిన సాయి ప్రతాప్.. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.

ఇకపోతే దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి బాగా సన్నిహితుడైన సాయి ప్రతాప్.. కొన్ని కారణాల వల్ల టీడీపీ పార్టీలో చేరారు. అయితే ఆయన టీడీపీలో చేరినా.. అక్కడ కూడా సరిగ్గా ఇమడలేకపోతున్నారని సమాచారం. అంతే కాకుండా ఓ సమయంలో ఆయన వైఎస్ జగన్ ను డైనమిక్ లీడరంటూ కూడా ప్రశంసించారు. కాగా ఇవాళ టీడీపీకి రాజీనామా చేసిన సాయిప్రతాప్.. ఇక త్వరలోనే వైసీపీలో చేరడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Follow Us