దేశంలోనే మొదటిసారి వర్క్ షీట్స్ పెట్టిన ఘనత తెలంగాణకె దక్కుతుందన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

|

Mar 24, 2021 | 8:50 PM

దేశంలో మొదటిసారి వర్క్‌షీట్స్‌ పెట్టిన ఘనత తెలంగాణకె దక్కుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభలో తెలిపారు. బుధవారం అసెంబ్లీ బడ్జె్‌ట్‌ సమావేశాల సందర్భంగా ఆమె సభలో ప్రసంగించారు.

దేశంలోనే మొదటిసారి వర్క్ షీట్స్ పెట్టిన ఘనత తెలంగాణకె దక్కుతుందన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి..
Sabitha Indra Reddy
Follow us on

దేశంలో మొదటిసారి వర్క్‌షీట్స్‌ పెట్టిన ఘనత తెలంగాణకె దక్కుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభలో తెలిపారు. బుధవారం అసెంబ్లీ బడ్జె్‌ట్‌ సమావేశాల సందర్భంగా ఆమె సభలో ప్రసంగించారు. ఇప్పటికే టీ-సట్‌ యాప్‌ను 12లక్షల మంది విద్యార్థులు డౌలోడ్‌ చేసుకున్నారని.. 85శాతం డిజిటిల్‌ స్టడీ తెలంగాణలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. డిజిటల్‌ పాఠాలు పిల్లలకు అందించిన రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిదిగా పేర్కొన్నారు మంత్రి. హైదరాబాద్‌ నగరంలో వరదల్లో సర్టిఫికెట్స్‌ నష్టపోయిన విద్యార్థులకు మళ్ళీ కొత్త సర్టిఫికెట్లు జారీ చేసేవిధంగా కూడా చూశామన్నారు.

కరోనా ప్రభావం ఇంకా రాష్ట్రంలో కొనసాగుతుందని.. కరోనా వల్ల విద్యార్థుల చదువుకు ఇబ్బందులు కాకుండా డిజిటిల్‌ తరగలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కస్తూర్బా గురుకురాల్లో కోర్సులు పెంచి, ఆపై ఇంటర్ వరకు చదువుకునే తరగతులు పెంచామని అన్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలకు, డిగ్రీ కాలేజీలకు నిధులు కావాల్సినన్ని ప్రభుత్వం ఇస్తోందని పేర్కొన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్స్ నియామకం త్వరలోనే ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు.

ఇక విద్యాలయాల యజ్ఞానికి ప్రభుత్వం స్వీకారం చుట్టిందని.. రాబోవు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల రూపులేకలు మారిపోతాయని అన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇందు కోసమే బడ్జెట్ లో 4వేల కోట్లు ప్రత్యేక నిధి కేటాయింపులు చేశామని.. నేను(సబితా ఇంద్రారెడ్డి), కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు ప్రభుత్వం చేసిందని అన్నారు.
ఈ కమిటీ ఆధ్వర్యంలో కొత్త విధివిధానాలు- ప్రణాళికలు కమిటీ తీసుకుంటుందని అన్నారు సబితా ఇంద్రారెడ్డి. అంతర్ జిల్లా బదిలీలు, మహిళలు ప్రత్యేక సెలవులు ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు.

ప్రైవేట్ పాఠశాలల టీచర్స్ జీతాల పై తిరుపతి రావు కమిటీని ప్రభుత్వం వేసిందని.. విద్యాశాఖ తరపున తిరుపతిరావు కమిటీ సిఫార్సులు అమలు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇక DSC త్వరలో భర్తీ ప్రభుత్వం చేసే ఆలోచనలో ఉందని..
గురుకురాల్లో ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా అన్ని రంగాల్లో విద్యార్థులు దూసుకుపోతున్నారని తెలిపారు.

 

మరిన్ని ఇక్కడ చదవండి: ట్రాన్స్‏జెండర్ కూతురిని పరిచయం చేసిన షకీలా.. నెట్టింట్లో వైరల్‏గా మారిన ఫోటోలు..

Treasure hunt: అడ్డెడ్డె.. అస్సలు అడ్డూఅదుపు లేదు.. గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు, జేసీబీతో తవ్వకాలు