టీడీపీ చరిత్రలోనే తొలిసారిగా ఒంటరి పోరు

| Edited By:

Mar 29, 2019 | 5:29 PM

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటితో 37 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1982 మార్చి 29న హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా తన పార్టీ పేరు ‘తెలుగుదేశం’ అని ఎన్టీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత 9 నెలలకే టీడీపీ అధికారంలోకి రాగా.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ క్రియేట్ చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో ఏర్పాటైన టీడీపీ.. ఆవిర్భావం నాటి నుంచి ఎన్నికల్లో వేరే పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలో దిగుతోంది. 1983 మొదలు ప్రతి […]

టీడీపీ చరిత్రలోనే తొలిసారిగా ఒంటరి పోరు
Follow us on

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటితో 37 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1982 మార్చి 29న హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా తన పార్టీ పేరు ‘తెలుగుదేశం’ అని ఎన్టీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత 9 నెలలకే టీడీపీ అధికారంలోకి రాగా.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ క్రియేట్ చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో ఏర్పాటైన టీడీపీ.. ఆవిర్భావం నాటి నుంచి ఎన్నికల్లో వేరే పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలో దిగుతోంది. 1983 మొదలు ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీ వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంది. కానీ 37 ఏళ్ల ప్రస్థానంలో తొలిసారిగా.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా బరిలో దిగుతోంది.

టీడీపీ తొలిసారి పోటీ చేసిన 1983 ఎన్నికల్లో మేనకా గాంధీ నాయకత్వంలోని సంజయ్ విచార్ మంచ్‌తో జత కట్టింది. ఆ ఎన్నికల్లో సంజయ్ విచార్ మంచ్‌కి ఎన్టీఆర్ ఐదు స్థానాలను కేటాయించారు. తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో 201 స్థానాలను గెలుచుకుంది.