బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కి, ప్రతిపక్ష బీజేపీకి మధ్య విచిత్రమైన ‘పోరు’ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ముందు సినీ, టీవీ నటీనటులను చేర్చుకోవడం ద్వారా బీజేపీ.. టీఎంసీని దెబ్బ కొట్టాలనుకుంటోంది. ప్రచారానికి ప్రచారం, గ్లామర్ కి గ్లామర్ రెండూ తోడవుతాయని ఆశిస్తోంది. తాజాగా సుమారు డజను మంది యువ స్టార్స్ కమలం పార్టీలో చేరారు. వీరిలో 35 ఏళ్ళ యాష్ దాస్ గుప్తా, ఇంకా దేవ్ అధికారి, సంధ్యా రాయ్ వంటివారున్నారు. గత ఎన్నికల్లో టీఎంసీనిలబెట్టిన స్టార్స్ లో చాలామంది విజేతలయ్యారు. దీంతో ఇప్పుడు బీజేపీ కూడా అదే ‘స్క్రిప్ట్’ ను ఫాలో అవుతోంది. యాష్ దాస్ గుప్తా బెంగాలీ సినీ,టీవీ నటుడు కూడా.. 2016 లో గ్యాంగ్ స్టర్ అనే చిత్రంతో తెరంగేట్రం చేశాడు. తృణమూల్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్ కి ఇతడు ఫ్రెండ్.. బహుశా యువతను కమలనాథులు ప్రోత్సహించాలనుకుంటున్నట్టు కనిపిస్తోందని యాష్ దాస్ గుప్తా అన్నారు.
తనకు మమతా బెనర్జీ అంటే ఎంతో అభిమానమని,ఆమెను తన సోదరిగా భావిస్తానని ఆయన చెప్పాడు. ఇక పపియా అధికారి. సౌమిలి బిశ్వాన్ వంటి స్టార్స్ కూడా నిన్న బీజేపీలో చేరారు. అయితే వీరిలో ఎంతమంది ఎన్నికల్లో పోటీ చేస్తారన్నది తెలియడంలేదు.
Read More:
నా తండ్రిని చంపిన వారిపై ఎలాంటి కోపం, ద్వేషం లేదు.. పుదుచ్చేరి పర్యటనలో ఆసక్తికర కామెంట్స్ చేసిన ..