దమ్ముందా.. ఒక్కరిని తీసుకెళ్లండి: మోదీకి దీదీ సవాల్

టీఎంసీ పార్టీకి చెందిన 40మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. దమ్ముంటే ఒక్క ఎమ్మెల్యేనైనా తీసుకెళ్లాలంటూ ఆమె సవాల్ విసిరారు. బీజేపీలా ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్లే సంప్రదాయం తమకు లేదని, మోదీ వ్యాఖ్యలు పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని అన్నారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడటానికి సిగ్గు లేదా..? అంటూ ఆమె మండిపడ్డారు. ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగుతున్న మోదీ లోక్‌సభ నామినేషన్‌ను […]

దమ్ముందా.. ఒక్కరిని తీసుకెళ్లండి: మోదీకి దీదీ సవాల్

Edited By:

Updated on: May 01, 2019 | 11:36 AM

టీఎంసీ పార్టీకి చెందిన 40మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. దమ్ముంటే ఒక్క ఎమ్మెల్యేనైనా తీసుకెళ్లాలంటూ ఆమె సవాల్ విసిరారు. బీజేపీలా ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్లే సంప్రదాయం తమకు లేదని, మోదీ వ్యాఖ్యలు పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని అన్నారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడటానికి సిగ్గు లేదా..? అంటూ ఆమె మండిపడ్డారు. ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగుతున్న మోదీ లోక్‌సభ నామినేషన్‌ను వెంటనే రద్దు చేయాలంటూ ఈసీకి తమ పార్టీ ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రధానిగా కాదు.. మాజీ ప్రధానిగా ఉండే హక్కును కూడా మోదీ కోల్పోయారని మమత నిప్పులు చెరిగారు.