టీఆర్ఎస్‌కు ‘సోమారపు’ రాజీనామా..!

| Edited By:

Jul 09, 2019 | 12:55 PM

టీఆర్ఎస్‌కు ఆ పార్టీ నేత సోమారపు సత్యనారాయణ రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీలో తనకు జరుగుతున్న అవమానంతో కలత చెంది రాజీనామా చేసినట్లు వెల్లడించారు. రామగుండంలో తన ఓటమికి బాల్క సుమన్‌తో పాటు మరికొందరు పార్టీ నేతలే కారణమన్నారు. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో గోదావరి ఖని నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. సోమారపుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కోరుగంట చంద్ర విజయం సాధించాడు. ఆ తర్వాత చంద్ర […]

టీఆర్ఎస్‌కు సోమారపు రాజీనామా..!
Follow us on

టీఆర్ఎస్‌కు ఆ పార్టీ నేత సోమారపు సత్యనారాయణ రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీలో తనకు జరుగుతున్న అవమానంతో కలత చెంది రాజీనామా చేసినట్లు వెల్లడించారు. రామగుండంలో తన ఓటమికి బాల్క సుమన్‌తో పాటు మరికొందరు పార్టీ నేతలే కారణమన్నారు. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో గోదావరి ఖని నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. సోమారపుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కోరుగంట చంద్ర విజయం సాధించాడు. ఆ తర్వాత చంద్ర టీఆర్ఎస్‌లో చేరారు.

టీఆర్ఎస్‌లో క్రమశిక్షణ లేకుండా పోయిందని సోమారపు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన కోరుగంట చంద్ర టీఆర్ఎస్‌లో చేరడంతో సోమారపు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. అలాగే.. ఆయన బీజేపీలో కూడా చేరబోతున్నారని సమాచారం.