August 27, 2026
venkata chari
ఇంట్లో సాధారణంగా కనిపించే వాము ఆకుల్లో ఆరోగ్యానికి ఉపయోగపడే పలు గుణాలు ఉన్నాయని చెబుతున్నారు.
వాము ఆకులను పలు రకాలుగా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి సమస్యల్లో ఇవి ఉపశమనాన్ని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
వాము ఆకుల్లో ఉండే థైమోల్‌కు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం ఉందని చెబుతున్నారు.
వాము ఆకుల కషాయం తాగితే జలుబు, దగ్గు, ఫ్లూ, శ్వాసకోశ సమస్యల్లో ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వాము ఆకుల రసం తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు, మలబద్ధకం వంటి ఇబ్బందుల్లో ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
వాము ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్, ప్రొటీన్, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి.
వాము ఆకులకు నొప్పి నుంచి ఉపశమనం కలిగించే లక్షణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇవి రోగనిరోధక శక్తికి కూడా తోడ్పడతాయని పేర్కొంటున్నారు.
వాము ఆకుల్లో యాంటీఆక్సిడెంట్, యాంటీబయాటిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయని సమాచారం.
ఆకులను చూర్ణం చేసి వాసన చూడొచ్చు. ఊరగాయల రుచి, వాసన పెంచేందుకు కూడా వాము ఆకులను ఉపయోగిస్తారు.
వాము ఆకులను అధికంగా తీసుకుంటే కడుపులో చికాకు, గ్యాస్, విరేచనాలు రావొచ్చు. కాబట్టి మితంగా వాడటం మంచిది.