చాణక్య నీతి : ఈ నలుగురి ముందు కన్నీళ్లు కార్చకండి.. తప్పు  మీదే అవుద్దీ

Samatha

29 August 2026

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది. అవి నేటి తరం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి.

అయితే చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకం రచించిన విషయం తెలిసిందే. దానిలో అనేక అంశాలను పొందుపరిచారు. డబ్బు, బంధాలు బంధుత్వాలు ఇలా చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది.

అదే విధంగా చాణక్యుడు కొందరి ముందు కన్నీళ్లు కార్చకూడదు. కొంత మంది ముందు కన్నీళ్లు కార్చడం మీకు అనేక సమస్యలను సృష్టిస్తుందని చెప్పుకొచ్చాడు. కాగా, దాని గురించి తెలుసుకుందాం.

ఆ చార్య చాణక్యుడి ప్రకారం ఎప్పుడూ కూడా మీ శత్రువుల ముందు మీరు కన్నీరు పెట్టుకోకూడదు. దీని వలన మీరు ధైర్యం కోల్పోయారని, భావించి, మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తూ ఉంటారు.

అదే విధంగా మిమ్మల్ని చూసి అసూయపడే వారి  ముందు కూడా మీరు కన్నీరు కార్చడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు.

అలాగే చాణక్యుడు మాట్లాడుతూ, మన ముందు కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే స్నేహాలు కొనసాగించే వారు ఉంటారు. అందువలన అలాంటి వారి ముందు కన్నీరు పెట్టుకోకూడదంట.

అంతే కాకుండా  మిమ్మల్ని గానీ, మీ మాటలను గానీ విలువ ఇవ్వని వారి ముందు మీ భావాలను వ్యక్త పరిచే తప్పు ఎప్పుడూ చేయకూడదు. అలాంటి వ్యక్తి ముందు మీరు ఏడిస్తే, వారు మీ కన్నీళ్లకు విలువను ఇవ్వరంట.

ఆచార్య చాణక్యుని ప్రకారం, సహజంగా బలహీనంగా ఉండే లేదా చిన్న విషయానికే భయపడే వారి ముందు మీరు ఎప్పుడూ ఏడవకూడదు. వారు మీలో ఇంకెంత భయాన్ని కలిగిస్తారంట.