విజయనగరం జిల్లాలో అధికార పార్టీకి షాక్‌.. మున్సిపల్‌ ఎన్నికల ముందు కీలక నేత రాజీనామా

|

Feb 19, 2021 | 5:06 PM

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో తన మద్దతుదారులను గెలిపించున్న అధికార పార్టీ వైసీపీ ఫుల్‌ జోష్‌లో ఉంది. ఇదే స్పీడ్‌తో

విజయనగరం జిల్లాలో అధికార పార్టీకి షాక్‌.. మున్సిపల్‌ ఎన్నికల ముందు కీలక నేత రాజీనామా
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో తన మద్దతుదారులను గెలిపించున్న అధికార పార్టీ వైసీపీ ఫుల్‌ జోష్‌లో ఉంది. ఇదే స్పీడ్‌తో మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఫంక గాలీని వీచేందుకు ఆ పార్టీ రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీకి విజయనగరం జిల్లాలో ఊహించని షాక్ తగిలింది.

విజయనగరం జిల్లాకు చెందిన కీలక నేత, డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి మామ, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర రాజు వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాల వలనే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు శత్రుచర్ల ప్రకటించారు. కార్యకర్తల సమావేశం తర్వాత ఏ పార్టీలో చేరుతానన్నదానిపై స్పష్టత ఇస్తాను అన్నారు. ఆయన రాజీనామాతో డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో వైసీపీ బలహీనపడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.శత్రుచర్ల రాజీనాతో వైసీపీతో పాటు, ఆయన కోడలు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి పెద్ద ఎదురుదెబ్బే.. ఆమె కురపాంలో గెలవడానికి శుత్రుచర్ల చంద్రశేఖర్ రాజు శ్రమే కారణమనే టాక్‌ ఉంది.

వైసీపీ పరిపాలనలో అభివృద్ధి ఆగిపోయిందని శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు ఆరోపించారు. కురపాం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు. వైసీపీకి అనుకూలంగా లేనివారికి పథకాలు అందడం లేదన్నారు. 2019 తరువాత ఎక్కడా అభివృద్ధి జరగ లేదన్నారు. పిడుగుపడి మరణించిన వారికి ఇప్పటి వరకు సాయం అందలేదని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పుష్ప శ్రీవాణి భర్త పరక్షిత్‌రాజుతో పాటు జిల్లాకు చెందిన పలువురు నేతలు చంద్రశేఖర రాజును బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది.

Read more:

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. ఆ అధికారం ఎస్ఈసీకి లేదన్న ధర్మాసనం