దేశ వ్యాప్తంగా జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లోనే వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపునకు అన్ని రాష్ట్రాల్లో అధికార యంత్రాంగాలు సర్వం సిద్ధం చేస్తాయి. అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు జరగనుంది. అనేక మంది ప్రముఖ రాజకీయ నేతల జాతకాలు ఈ ఫలితాల్లో తేలనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమయ్యింది. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.