చింతూరు పంచాయతీ ఎన్నికల్లో విషాదం.. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఏపీవో హఠాత్తుగా మృతి

|

Feb 17, 2021 | 1:26 PM

తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సరళిలో విషాదం చోటు చేసుకుంది. చింతూరు మండలం కొత్తపల్లి పోలింగ్ బూత్‌లో ఏపీవోగా విధులు..

చింతూరు పంచాయతీ ఎన్నికల్లో విషాదం.. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఏపీవో హఠాత్తుగా మృతి
Follow us on

తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సరళిలో విషాదం చోటు చేసుకుంది. చింతూరు మండలం కొత్తపల్లి పోలింగ్ బూత్‌లో ఏపీవోగా విధులు నిర్వర్తిస్తున్న దైవ కృపావతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను రంపచోడవరం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు.

మృతురాలు దైవకృపావతి కాకినాడ అర్బన్ ప్రాంతంలో మున్సిపల్ స్కూల్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 

Read more:

కృష్ణా జిల్లా గూడూరులో పోలింగ్‌ సరళిని పరిశీలించిన ఎస్పీ.. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశామన్న రవీంద్రనాథ్‌ బాబు