AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుస ఎన్నికల నేపథ్యాన మీమాంసలో ఏపీ సర్కారు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల క్రతువు ఎప్పుడు, ఎలా అనేదానిపై కసరత్తు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశల నిర్వహణపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్నికల నేపథ్యంలో అసలు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలా లేదా మరో ప్రత్యామ్న్యాయం..

వరుస ఎన్నికల నేపథ్యాన మీమాంసలో ఏపీ సర్కారు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల క్రతువు ఎప్పుడు, ఎలా అనేదానిపై  కసరత్తు
Venkata Narayana
|

Updated on: Feb 17, 2021 | 1:03 PM

Share

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశల నిర్వహణపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్నికల నేపథ్యంలో అసలు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలా లేదా మరో ప్రత్యామ్న్యాయం చూడాలా అన్న అంశంపై ఇంకా కసరత్తు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయితే, దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. మరోవైపు, ఏపీలో వరుసగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు విడతల పంచాయతీ ఎన్నికలు దాదాపు గా ముగిశాయి. ఈ నెల 21 నాటికి ఆఖరి విడుత ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఈ లోపే మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం.

ఈ నేపథ్యంలోనే ఏపీ బడ్జెట్ సమావేశాలు పై ఇంకా ఎలాంటి క్లారిటీ రావడం లేదు. మొదట మార్చి మొదటివారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిచాలని ప్రభుత్వం కసరత్తు చేసినట్టు సమాచారం. అయితే తాజాగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం, ఆ ఎన్నికల ప్రక్రియ మార్చి 14 వరకు కొనసాగనుండటంతో ఆ ఆలోచనను ప్రభుత్వం మార్చుకుంటున్నట్టు సమాచారం. అయితే మార్చి మూడు, నాలుగో వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని భావిస్తుంది. అయితే అది కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం పైనే ఇది ఉండబోతుంది.

ఒకవేళ రాష్త్ర ఎన్నికల సంఘం ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తే ఆయా తేదీలనుబట్టి బడ్జెట్ సమావేశాలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే, ఒకవేళ ఆ ఎన్నికల ప్రక్రియ కూడా త్వరగా పూర్తి అయ్యి సమయం మిగిలితే సరే కానీ, అలా కానీ పక్షంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశంపై ఇంకా కసరత్తు చేస్తుంది ప్రభుత్వం. నిజానికి మార్చి 31 నాటికి రాష్ట్ర బడ్జెట్ ను ఆమోదించాలి. గత ఏడాది కరోనా కారంగా బడ్జెట్ సమావేశాలు లేకుండా ఆర్డినెన్స్ ద్వారా ఆమోదింప చేసుకుని తర్వాత బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. అయితే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి కోరాల్సిన అవసరం ఉంది.

ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ పై ఏమైనా ఆంక్షలు విధించే అవకాశాలు ఉండటంతో ప్రభుత్వం ప్రత్యామ్న్యాయ మార్గాలు అన్వేషిస్తున్నట్టు తెలుస్తుంది. మరో పక్క మంత్రులు అధికారులు కూడా ఎన్నికల హడావిడిలో ఉంటారు. అయితే కనీసం వారం రోజుల వ్యవధిలో బడ్జెట్ సమావేశాలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. లేదా ఎన్నికల ప్రక్రియ మార్చి నెలాఖరు వరకు కొనసాగితే ప్రభుత్వం ముందు రెండు అషన్స్ కనిపిస్తున్నాయి. మొదటిది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం, లేదా ఆర్డినెన్స్ జారీ చేసి ముందుకు సాగడం. అయితే ఎన్నికల కమిషనర్ నిర్ణయం అనంతరం మాత్రమే బడ్జెట్ సమావేశాల పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.

Read also : ఆంధ్రప్రదేశ్ పంచాయతీ మూడో విడత ఎన్నికలు, పలు చోట్ల ఉద్రిక్తతలు, అంతరాయాలు, బహిష్కరణలు, చెదురుమదురు ఘటనలు