బీజేపీ ‘ బూచి ‘ ని చూసి భయపడకండి !

తెలంగాణాలో బీజేపీ ‘ బూచి ‘ ని చూసి భయపడవద్దని సీఎం కేసీఆర్ తమ పార్టీ నేతలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, విమర్శలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాటికి స్పందించరాదని అన్నారు. బీజేపీ నేతల ఆరోపణలకు పార్టీ నాయకత్వమే సరైన సమాధానమిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణలో కమలం పార్టీకి నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. కానీ టీఆర్ఎస్ కు వందమందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, […]

బీజేపీ ' బూచి ' ని చూసి భయపడకండి !
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 28, 2019 | 2:24 PM

తెలంగాణాలో బీజేపీ ‘ బూచి ‘ ని చూసి భయపడవద్దని సీఎం కేసీఆర్ తమ పార్టీ నేతలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, విమర్శలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాటికి స్పందించరాదని అన్నారు. బీజేపీ నేతల ఆరోపణలకు పార్టీ నాయకత్వమే సరైన సమాధానమిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణలో కమలం పార్టీకి నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. కానీ టీఆర్ఎస్ కు వందమందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 32 మంది జెడ్పీ చైర్మన్లు ఉన్నారని, పైగా ప్రజల సహకారంతో రాష్ట్రంలో మనదే పెద్ద పార్టీగా అవతరించిందని ఆయన పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లతో తెలంగాణ భవన్ లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన.. మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలన్న సూచనను తోసిపుచ్చారు. త్వరలో జరిగే ఈ ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

టీవీ చర్చల్లో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడరాదని తమ పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. పార్టీ అనుమతి లేనిదే టీవీ డిబేట్లలో పాల్గొనరాదని, కానీ పాల్గొన్న పక్షంలో సస్పెన్షన్ వేటు పడడం ఖాయమని ఆయన హెచ్చరించారు. టీవీ డిబేట్లలో పాల్గొనే అంశంపై ఓ కమిటీని ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.ఈ కమిటీ ఓ నియమావళిని రూపొందించవచ్చునని సూచనప్రాయంగా పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు పూర్తి అయిన తరువాత గ్రామ స్థాయి నుంచి పార్టీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని ఆయన వివరించారు. పార్టీలో కొత్తగా సభ్యులను చేర్పించడంలో నేతలు టార్గెట్ ను సాధించలేదని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఎమ్మెల్యే కనీసం 50 వేలమందిని సభ్యులుగా చేర్పించాలని ఆయన టార్గెట్ విధించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ సందర్భంగా కేసీఆర్ మొట్టమొదట మెంబర్ షిప్ స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని యుధ్ధప్రాతిపదికన చేపట్టాలని కూడా ఆయన సూచించారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో