విశాఖ వైసీపీలో భగ్గుమన్న అసమ్మతి

|

Mar 17, 2019 | 1:21 PM

విశాఖ: అభ్యర్ధుల పూర్తి జాబితాను వైసీపీ పార్టీ ప్రకటించగానే విశాఖ వైసీపీలో అసమ్మతి భగ్గుమన్నది. విశాఖ తూర్పు నియోజకవర్గం టికెట్‌ను వైసీపీ నేత వంశీకృష్ణకు కాకుండా విజయనిర్మలకు కేటాయించడంతో వంశీకృష్ణ అనుచరులు నిరసనలకు దిగారు. ఇసుకతోడు ప్రాంతంలో రాస్తారోకో నిర్వహించారు. ఎంపీ అభ్యర్ధి కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వంశీ కావాలి అంటూ నినాదాలు చేశారు. వైసీపీ కార్యాలయంపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఒక మహిళా కార్యకర్త నిద్రమాత్రలు మింగడంతో ఆమెను వెంటనే […]

విశాఖ వైసీపీలో భగ్గుమన్న అసమ్మతి
Follow us on

విశాఖ: అభ్యర్ధుల పూర్తి జాబితాను వైసీపీ పార్టీ ప్రకటించగానే విశాఖ వైసీపీలో అసమ్మతి భగ్గుమన్నది. విశాఖ తూర్పు నియోజకవర్గం టికెట్‌ను వైసీపీ నేత వంశీకృష్ణకు కాకుండా విజయనిర్మలకు కేటాయించడంతో వంశీకృష్ణ అనుచరులు నిరసనలకు దిగారు. ఇసుకతోడు ప్రాంతంలో రాస్తారోకో నిర్వహించారు.

ఎంపీ అభ్యర్ధి కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వంశీ కావాలి అంటూ నినాదాలు చేశారు. వైసీపీ కార్యాలయంపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఒక మహిళా కార్యకర్త నిద్రమాత్రలు మింగడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.