క్యాంప్‌ ఆఫీస్‌పై క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్‌.. మోతే శ్రీలతశోభన్‌రెడ్డిని సత్కరించిన పద్మారావుగౌడ్‌

తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఐదు మునిసిపల్ డివిజన్లను తెరాస కైవసం చేసుకొని నియోజకవర్గంలో తమ సత్తాను..

క్యాంప్‌ ఆఫీస్‌పై క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్‌.. మోతే శ్రీలతశోభన్‌రెడ్డిని సత్కరించిన పద్మారావుగౌడ్‌
K Sammaiah

|

Feb 12, 2021 | 12:33 PM

తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఐదు మునిసిపల్ డివిజన్లను తెరాస కైవసం చేసుకొని నియోజకవర్గంలో తమ సత్తాను నిరుపించుకుందని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన తార్నాక డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి కి హైదరాబాద్ డిప్యూటీ మేయర్ పదవి లభించడంతో సితాఫలమండి లో సత్కరించారు.

శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి కి డిప్యూటీ మేయర్ పదవి దక్కడం ఆనందాన్ని కలిగిస్తోందని పద్మారావుగౌడ్‌ అన్నారు. త్వరలోనే సితాఫలమండీ లో కొత్తగా సికింద్రాబాద్ ఎంఎల్ ఏ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించనున్నామని, సికింద్రాబాద్ కు చెందిన అన్ని డివిజన్ల కార్పోరేటర్ల కార్యాలయాలను ఈ ప్రాంగణంలోనే ప్రారంభిస్తామని తెలిపారు. డిప్యూటీ మేయర్ తో సహా కార్పొరేటర్లు ప్రతి రోజు కొంత సమయం ఖచ్చితంగా ప్రజలకు ఈ కార్యాలయం ద్వారానే అందుబాటులో ఉంటారని అయన తెలిపారు.

నిత్యం ప్రజల్లో ఉండడం ద్వారా కార్పరేటర్లు మంచి పేరు తెచ్చుకోవాలని అయన సూచించారు. తార్నాక కర్పరేటర్ శ్రీమతి మోతే శ్రీలత రెడ్డికి డిప్యూటీ మేయర్ పదవిని కల్పించినందుకు ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అయన కృతఙ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత రెడ్డి తో పాటు కార్పరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి కంది శైలజ, శ్రీమతి రాసురి సునిత, శ్రీమతి లింగాని ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Read more:

ఏపీలో అధికారపార్టీ నేతలకు కొనసాగుతున్న నోటీసుల పర్వం.. ఈసారి ఆ మంత్రిపై ఎస్‌ఈసీ కన్నెర్ర

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu