హితేష్‌కు రద్దవ్వని అమెరికా పౌరసత్వం.. పోటీలోకి దగ్గుబాటి?

ప్రకాశం జిల్లాలోని పర్చూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ తరపున సీనియర్‌ రాజకీయ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ స్థానంలో ఆయన కుమారుడు హితేష్‌ చెంచురాంను పోటీలో దించాలని ప్రయత్నాలు జరిపినా, అమెరికా పౌరసత్వం ఇంకా రద్దవని కారణంగా ఆయన పోటీ చేసేందుకు అనర్హులు. దీంతో దగ్గుబాటి వేంకటేశ్వర రావునే పోటీలోకి దించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన కూడా సుముఖంగా ఉండటంతో ఆ స్థానానికి ఆయననే ఖరారు చేసినట్లు ప్రచారం […]

హితేష్‌కు రద్దవ్వని అమెరికా పౌరసత్వం.. పోటీలోకి దగ్గుబాటి?

Updated on: Mar 14, 2019 | 10:49 AM

ప్రకాశం జిల్లాలోని పర్చూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ తరపున సీనియర్‌ రాజకీయ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ స్థానంలో ఆయన కుమారుడు హితేష్‌ చెంచురాంను పోటీలో దించాలని ప్రయత్నాలు జరిపినా, అమెరికా పౌరసత్వం ఇంకా రద్దవని కారణంగా ఆయన పోటీ చేసేందుకు అనర్హులు. దీంతో దగ్గుబాటి వేంకటేశ్వర రావునే పోటీలోకి దించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన కూడా సుముఖంగా ఉండటంతో ఆ స్థానానికి ఆయననే ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గత నెలలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో కలిసి చెంచురామ్ హితేష్‌ వైసీపీలో చేరారు. ఆ సమయంలో వెంకటేశ్వరరావు హితేష్ దగ్గరే ఉన్నా వైసీపీలో చేరలేదు, ఆ పార్టీ కండువాను కప్పుకోలేదు.

Follow Us