ఉద్యోగం లేకున్నా పిల్లల పోషణ తండ్రి బాధ్యతేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. నిరుద్యోగం సాకుగా చూపించి పిల్లల సంక్షేమం, విద్యను విస్మరించడం చట్టపరంగా, వ్యక్తిగతంగా తప్పు అని కోర్టు పేర్కొంది. పిల్లల ఆకలి, పాఠశాల ఫీజులు వంటివి తండ్రి విస్మరించడానికి వీల్లేదు. ప్రతి తండ్రికి ఇది పూర్తి స్థాయి బాధ్యత అని తీర్పు వెల్లడించింది.