V Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ వీహెచ్‌కు కేటుగాళ్ల ఫోన్.. ఆయనతో పెట్టుకుంటే ఇత్తడైపోద్ది..
కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత్ రావు తెలియని వారు ఉండరు.. అయతే హనుమంత్ రావు కామెడీ మాటలు చూసి అమాయకుడు అనుకోకండి.. హనుమంత్ రావుతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఒక కేటుగడికి చూపించాడు VH.. ఇంతకు ఏమీ జరిగింది అంటే..
హైదరాబాద్, అక్టోబర్ 06: కాంగ్రెస్ సీనియర్ నేత VH ను మరో సీనియర్ ఆంధ్ర నేత హరిరామ జోగయ్య పేరిట బురడి కొట్టించే యత్నం చేశాడు ఒక కేటుగాడు. 78010 96535 నంబర్ నుంచి హరిరామ జోగయ్య ను అంటూ ఫోన్ చేశాడు.. ఆపదలో ఉన్నాను అర్జెంట్ గా డబ్బులు పంపాలని వి.హెచ్ ను కోరాడు.. ముసలి వాయిస్ తో నీరసంగా మాట్లాడాడు ఆ కేటుగాడు.. తనకు డబ్బులు కావాలని వెంటనే 96521 96535 నంబర్ కు గూగుల్ పే చేయాలని విజ్ఞప్తి చేశాడు ఆ వ్యక్తి..
హరిరామ జోగయ్య నంబర్ కాకపోవడంతో వెంటనే అయిన ఫోన్ కి ఫోన్ చేశాడు ఆ VH.. నంబర్ కలవకపోవడం తో ఓ వ్యక్తిని ఆయన ఇంటికి పంపి విచారణ చేసిన వి.హెచ్.. ఇది ఫేక్ కాల్ అని తేలడంతో వెస్ట్ గోదావరి ఎస్పీకి ఫిర్యాదు చేశారు VH.. ఖమ్మం నుంచి ఫోన్ వచ్చినట్లు చెప్పిన వెస్ట్ గోదావరి ఎస్పీ తిరిగి చెప్పడంతో ఖమ్మం ఎస్పీ, సైబరాబాద్ పోలీస్ లకు వి.హెచ్ ఫిర్యాదు చేశారు.. Vh తో అంత ఈజీ కాదని ఇప్పుడు చర్చ మొదలైంది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం