తెలంగాణలో 10 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ గెలుస్తోంది- కుంతియా

తెలంగాణలో కచ్చితంగా 10 ఎంపీ స్థానాలు గెలుస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియా ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్‌ శాతం తగ్గడం.. ఈసీ వైఫల్యమే కారణమన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సరైన సదుపాయాలు కల్పించలేదని ఆరోపించారు. నిజామాబాద్‌లో అవకాశం ఉన్నా బ్యాలెట్ నిర్వహించలేదని విమర్శించారు. 12 ఈవీఎంలు పెట్టడం వల్ల ఓటు వేసేందుకు జనాలు ఇబ్బంది పడ్డారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు ఈసీ సహకరించిందని వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్ ను కేవలం పార్టీ కార్యకలాపాలకు వాడుకుంటున్నారని కుంతియా […]

తెలంగాణలో 10 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ గెలుస్తోంది- కుంతియా

Updated on: Apr 11, 2019 | 11:02 PM

తెలంగాణలో కచ్చితంగా 10 ఎంపీ స్థానాలు గెలుస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియా ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్‌ శాతం తగ్గడం.. ఈసీ వైఫల్యమే కారణమన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సరైన సదుపాయాలు కల్పించలేదని ఆరోపించారు. నిజామాబాద్‌లో అవకాశం ఉన్నా బ్యాలెట్ నిర్వహించలేదని విమర్శించారు. 12 ఈవీఎంలు పెట్టడం వల్ల ఓటు వేసేందుకు జనాలు ఇబ్బంది పడ్డారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు ఈసీ సహకరించిందని వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్ ను కేవలం పార్టీ కార్యకలాపాలకు వాడుకుంటున్నారని కుంతియా మండిపడ్డారు.