కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల

దేశంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా మేనిఫెస్టోను రూపొందించామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెప్పారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాదిగా మేనిఫెస్టో రూపకల్పనకు కృషి చేస్తున్నామన్నారు. హస్తం గుర్తును ప్రతిబింబించేలా మేనిఫెస్టోలో ఐదు ముఖ్యాంశాలు ఉంటాయన్నారు. మేనిఫెస్టోను  గదిలో కూర్చొని రూపొందించలేదని, ప్రజల మనసులో ఆలోచన ప్రతిబింబించేలా రూపకల్పన చేశామని ఆయన అన్నారు. సంక్షేమంతో సంపద సృష్టించడమే తమ లక్ష్యమని తెలిపిన ఆయన.. 2030 నాటికి దేశంలో పేదరిక […]

కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల

Edited By:

Updated on: Apr 02, 2019 | 5:19 PM

దేశంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా మేనిఫెస్టోను రూపొందించామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెప్పారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాదిగా మేనిఫెస్టో రూపకల్పనకు కృషి చేస్తున్నామన్నారు. హస్తం గుర్తును ప్రతిబింబించేలా మేనిఫెస్టోలో ఐదు ముఖ్యాంశాలు ఉంటాయన్నారు. మేనిఫెస్టోను  గదిలో కూర్చొని రూపొందించలేదని, ప్రజల మనసులో ఆలోచన ప్రతిబింబించేలా రూపకల్పన చేశామని ఆయన అన్నారు. సంక్షేమంతో సంపద సృష్టించడమే తమ లక్ష్యమని తెలిపిన ఆయన.. 2030 నాటికి దేశంలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని చెప్పారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ప్రియాంక గాంధీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, రణ్‌దీప్‌ సుర్జేవాలా తదితరులు పాల్గొన్నారు.

మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యంగా దృష్టి సారించిన ప్రధానాంశాలు:

*  ‘న్యాయ్‌ పథకం’ అమలు ద్వారా ఏడాదికి 72 వేలు చొప్పున పేదలకు అందిస్తాం. రెండోది నోట్ల రద్దుతో దెబ్బతిన్న దేశ ఆర్థికపరిస్థితిని మెరుగుపరచడం.

*  ప్రస్తుతం ఖాళీగా ఉన్న 22 లక్షల పోస్టులను 2020 నాటికి భర్తీ చేయడం.

* వ్యాపారం చేసుకోవడానికి తొలి మూడేళ్ల పాటు ఎలాంటి షరతులు లేకుండా అనుమతులు ఇవ్వడం.

* ఉపాధి హామీ పని దినాలను 100 నుంచి 150కి పెంచడం.

* రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్‌ .