కాంగ్రెస్‌కు షాక్‌ మీద షాక్.. కారెక్కేందుకు సిద్ధమైన మరో ఎమ్మెల్యే

| Edited By:

Mar 20, 2019 | 4:02 PM

హైదరాబాద్ : కాంగ్రెస్‌కు మరో ఎమ్మెల్యే ఝలక్ ఇచ్చారు. హస్తానికి హ్యాండిచ్చి కారెక్కబోతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరగా.. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా అదే గూటికి చేరబోతున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కొల్లాపూర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హర్షవర్థన్‌రెడ్డి ఇవాళ కలిశారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు హర్షవర్థన్‌రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని.. అవసరమైతే కాంగ్రెస్‌ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు.

కాంగ్రెస్‌కు షాక్‌ మీద షాక్.. కారెక్కేందుకు సిద్ధమైన మరో ఎమ్మెల్యే
Follow us on