మహిళలను అప్పుల ఊబిలోనుంచి బయటకు తీసుకు రావాలన్నదే సీఎం వైయస్ జగన్ ఆలోచన: మంత్రి అనిల్

|

Oct 12, 2021 | 9:38 PM

మహిళలను అప్పుల ఊబిలోనుంచి బయటకు తీసుకు రావాలన్నదే సీఎం వైయ‌స్ జగన్ ఆలోచన అని ఏపీ ఇరిగేష‌న్ శాఖ‌ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌

మహిళలను అప్పుల ఊబిలోనుంచి బయటకు తీసుకు రావాలన్నదే సీఎం వైయస్ జగన్ ఆలోచన: మంత్రి అనిల్
Anil Kumar Yadav
Follow us on

Minister Anil Kumar Yadav: మహిళలను అప్పుల ఊబిలోనుంచి బయటకు తీసుకు రావాలన్నదే సీఎం వైయ‌స్ జగన్ ఆలోచన అని ఏపీ ఇరిగేష‌న్ శాఖ‌ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. మహిళా సాధికారత కోసం రాష్ట్రంలో అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నార‌న్నారు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని లక్షల మంది అక్కచెల్లెమ్మలను మోసం చేశారని అనిల్ ధ్వ‌జ‌మెత్తారు.

వైయ‌స్ఆర్ ఆస‌రా ప‌థ‌కం కింద‌ రాష్ట్రంలో మహిళలకు రెండు విడతల్లో కలిపి రూ.12,759 కోట్లు నేరుగా లబ్దిదారుల అకౌంట్‌లో జ‌మ చేశార‌ని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నెల్లూరు జిల్లాలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. చంద్రబాబు హయాంలో రూ.14వేల కోట్లు ఉన్న డ్వాక్రా అక్కచెల్లెమ్మల బకాయిలు 2019 నాటికి రూ.25వేల 517 కోట్లకు చేరాయి. వైయ‌స్‌ జగన్ తన పాదయాత్రలో అక్కచెల్లెమ్మల బాధలు చూసి నాలుగు విడతలుగా వడ్డీతో సహా బకాయిలన్నీ పూర్తిగా చెల్లిస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి అధికారంలోకి రాగానే ఇప్పటికి రెండు విడతలుగా రూ.12,759 కోట్లు విడుదల చేశారన్నారు.

టీడీపీ హయాంలో సున్నావడ్డీ పథకానికి చంద్రబాబు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని మంత్రి చెప్పుకొచ్చారు. వైయ‌స్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత వైయ‌స్ఆర్ సున్నావడ్డీ పథకం ద్వారా.. ఆ వడ్దీ భారాన్ని మొత్తం మా ప్రభుత్వం భరిస్తోంది అని చెప్పి, దాదాపు 98లక్షల మంది మహిళలు లబ్ధి పొందేవిధంగా ఇప్పటికే రూ.2,354 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు మంత్రి అనిల్. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఇచ్చిన హామీ మేరకు 78 లక్షల మంది డ్వాక్రా సంఘాల మ‌హిళ‌ల‌ను ఓ అన్న‌లా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదుకుంటున్నార‌ని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.

Read also: AP Weather: ఉత్తర అండమాన్ ప్రాంతములలో అల్పపీడన అవకాశం, వచ్చే రెండు రోజులకు ఏపీకి వాతావరణ సూచన