Mamata Banerjee: ఒకటే ఉత్కంఠ..గెలుపు నీదా..నాదా.. బెంగాల్‌లో మరో సమరానికి సై అంటున్న మమతా బెనర్జీ..

|

Sep 05, 2021 | 8:53 PM

బెంగాల్‌ ఉప ఎన్నికల సమరం మొదలయ్యింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని భవానిపూర్‌ నియోజకవర్గం నుంచి అభ్యర్ధిగా ప్రకటించింది తృణమూల్‌ కాంగ్రెస్‌. భవానిపూర్‌తో పాటు మరో రెండు నియోజకవర్గాల అభ్యర్ధులను...

Mamata Banerjee: ఒకటే ఉత్కంఠ..గెలుపు నీదా..నాదా.. బెంగాల్‌లో మరో సమరానికి సై అంటున్న మమతా బెనర్జీ..
Mamata Banerjee
Follow us on

బెంగాల్‌ ఉప ఎన్నికల సమరం మొదలయ్యింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని భవానిపూర్‌ నియోజకవర్గం నుంచి అభ్యర్ధిగా ప్రకటించింది తృణమూల్‌ కాంగ్రెస్‌. భవానిపూర్‌తో పాటు మరో రెండు నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటించారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ ఘనవిజయం సాధించినప్పటికి నందిగ్రామ్‌ నుంచి మమత ఓడిపోయారు. అయినప్పటికి ఆమె సీఎం పగ్గాలు చేపట్టారు. భవానిపూర్‌ నియోజకవర్గానికి చాలాసార్లు ప్రాతినిధ్యం వహించిన మమత గత ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి పోటీ చేశారు. అనూహ్యంగా సువేందు అధికారి చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల ఫలితాల తరువాత భవానిపూర్‌ ఎమ్మెల్యే రాజీనామా చేసి మమతకు మార్గం సుగమం చేశారు.

భవానిపూర్‌ నుంచి బీజేపీ ఎవరిని అభ్యర్ధిగా దింపుతుందన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఈనెల 30వ తేదీన బెంగాల్‌లో మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్‌ 3వ తేదీన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. బెంగాల్‌లో బీజేపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు మమత.

అసెంబ్లీ ఎన్నికల తరువాత నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు తృణమూల్‌ గూటికి చేరారు. భవానిపూర్‌లో మమత విజయం నల్లేరు మీద నడకగానే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ బీజేపీకి సరైన అభ్యర్ధులు లేరు. అంతేకాదు.. కార్యకర్తల బలం కూడా తక్కువే.

ఆరునెలల్లో మమత అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది. అందుకే ఈ ఉప ఎన్నికలు మమతకు చాలా కీలకంగా మారాయి. గడువు లోగా ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని పదేపదే కోరారు మమత. చివరకు శనివారం బెంగాల్‌లో ఉప ఎన్నికల షెడ్యూల్‌ను మమత విడుదల చేసింది.

ఇక షంషేర్ గంజ్ నుంచి అమీరుల్ ఇస్లాం, జాంగీర్‌పూర్ నుంచి జాకీర్ హుస్సేన్ పోటీ చేయ‌నున్నారు. . భవానీపూర్ మిన‌హా మిగిలిన రెండు స్థానాలు ఎన్నిక‌ల సంద‌ర్భంగా అభ్యర్ధులు చనిపోవడంతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. భ‌వానీపూర్‌లో మాత్రం వ్య‌వ‌సాయ మంత్రి సోబ‌న్‌దేవ్ చ‌టోపాధ్యాయ్ మ‌మ‌త బెన‌ర్జి కోసం త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ఇవి కూడా చదవండి: ట్రాఫిక్‌లో హారన్ శబ్ధాలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఇక ఆ సౌండ్ పొల్యూషన్‌ వినిపించదు ఎందుకో తెలుసా..

Goat Farming: ఈ మొబైల్ యాప్ మీ దగ్గర ఉంటే చాలు.. మేకల పెంపకంలో లక్షలు సంపాదించడం నేర్పిస్తుంది..