TRS: తెలంగాణభవన్‌లో ప్రారంభమైన కీలక మీటింగ్.. విజయగర్జన సభపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

|

Oct 17, 2021 | 2:35 PM

తెలంగాణభవన్‌లో కీలక మీటింగ్ నిర్వహిస్తోంది TRS. సీఎం కేసీఆర్ అధ్యక్షత టీఆర్ఎస్ శాసనసభ, పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కొనసాగుతోంది.మంత్రులు, ఎమ్మెల్యేలు, MLCలు, ఎంపీలు..

TRS: తెలంగాణభవన్‌లో ప్రారంభమైన కీలక మీటింగ్.. విజయగర్జన సభపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
TRS Party
Follow us on

తెలంగాణభవన్‌లో కీలక మీటింగ్ నిర్వహిస్తోంది TRS. సీఎం కేసీఆర్ అధ్యక్షత టీఆర్ఎస్ శాసనసభ, పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కొనసాగుతోంది.మంత్రులు, ఎమ్మెల్యేలు, MLCలు, ఎంపీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. 25న జరిగే పార్టీ ప్లీనరీ, నవంబర్ 15న వరంగల్‌లో నిర్వహించే విజయగర్జన సభపై దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం కేసీఆర్. పార్టీ బలోపేతం, సంస్థాగత ఎన్నికలు, రాష్ట్ర, నగర, జిల్లా కమిటీల ఏర్పాటు కూడా సమావేశంలో చర్చకురానుంది. విజయగర్జన సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది TRS. కోవిడ్ కారణంగా ఇటీవల భారీ సభలేమీ నిర్వహించలేదు.

అందుకే వరంగల్‌ సభను ఫుల్‌జోష్‌తో నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటి నుంచే ప్లానింగ్ మొదలుపెట్టింది. విజయగర్జన ఏర్పాట్లపైనా నేతలకు సూచనలు చేయనున్నారు సీఎం కేసీఆర్. అటు టీఆర్ఎస్‌ అధ్యక్ష పదవి ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కేసీఆర్ తరపున 6 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు మంత్రులు..ఈనెల 22 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపసంహరణకు గడువు 24. అయితే పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నిక లాంఛనమే కానుంది.

ఇవి కూడా చదవండి: Software Update: మీ ఫోన్‌కు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మెసెజ్ వస్తోందా.. చేసుకోక పోతే ఇక అంతే..

Kotia Dispute: ఆంధ్రా -ఒడిషా బోర్డర్‌లో టెన్షన్.. రోజు రోజుకూ హీటెక్కుతున్న కొటియా కొట్లాట..