CM YS Jagan: పంచాయతీ ఎన్నికలపై అధికారులతో సీఎం జగన్ అత్యవసర భేటీ.. కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం..

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్టు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై రాష్ట్ర సర్కార్ అలర్ట్ అయ్యింది.

CM YS Jagan: పంచాయతీ ఎన్నికలపై అధికారులతో సీఎం జగన్ అత్యవసర భేటీ.. కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం..
YS Jagan

Updated on: Jan 25, 2021 | 6:29 PM

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్టు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై రాష్ట్ర సర్కార్ అలర్ట్ అయ్యింది. ఎన్నికల నిర్వహణపై కీలక అధికారులు, మంత్రులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యవసర భేటీ అయ్యారు. ఈ భేటీకి సీఎస్ ఆధిత్యనాథ్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏజీ శ్రీరామ్, మంత్రులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు తదితర ముఖ్యులు హాజరయ్యారు. ఎన్నికల వ్యవహారంపై కీలక చర్చలు జరుపుతున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్రంతో మాట్లాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం తుది నిర్ణయం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఉద్యోగులు కూడా ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.

Also read:

Karthika Deepam Climax: క్లైమాక్స్ అటూ ఇటూ అయితే ఫ్యాన్స్ బస్సులు, లారీలు వేసుకుని వచ్చేస్తారంటున్న డాక్టర్ బాబు

Green India Challenge: దేత్తడి హారిక ఛాలెంజ్‌ను స్వీకరించిన బిగ్‌బాస్ బ్యూటీ.. మొక్కలు నాటిన అందాల తార..