Kakani : దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని సాహసాలు జగన్ చేస్తున్నారు.. ఆనందయ్య మందుకు ప్రభుత్వ సహకారం : కాకాణి

|

Jun 13, 2021 | 4:24 PM

దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చెయ్యనటువంటి సాహసాలు సీఎం జగన్ చేస్తున్నారని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన..

Kakani : దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని సాహసాలు జగన్ చేస్తున్నారు.. ఆనందయ్య మందుకు ప్రభుత్వ సహకారం : కాకాణి
MLA Kakani
Follow us on

Anandayya medicine : దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చెయ్యనటువంటి సాహసాలు సీఎం జగన్ చేస్తున్నారని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో 10 కి 10 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుందని చెప్పిన ఆయన, నెల్లూరు జిల్లాలో వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని వెల్లడించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని కుటుంబాలకు ఆనందయ్య మందును అందించామని కాకాని తెలిపారు. మందు పంపిణీకి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

ప్రజాప్రతినిధులుగా ప్రమాణస్వీకారం చేసి రెండేళ్ళు పూర్తి అయిన నేపథ్యంలో ఆయన, నెల్లూరు వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ గొప్ప పాలనను టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజా సమస్యలను పరిష్కారిస్తుందని చెప్పారు. నకిలీ వ్యక్తులకు నవరత్నాలు నకిలీ రత్నాలుగానే కనిపిస్తున్నాయని ఆయన విమర్శించారు.

కరోనా తో తల్లిదండ్రులు చనిపోతే అనాధలుగా మారిన బిడ్డలకు 10 లక్షలు ఇచ్చేలా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చామని కాకాని చెప్పారు. మీడియా సమావేశంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మందల వెంకట శేషయ్య, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముత్తుకూరు శివ ప్రసాద్, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read also : Brahmangari Math : మొదటికొచ్చిన బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక.. ప్రభుత్వ అధీనంలోకి తీసుకునే ఆలోచన లేదన్న మంత్రి