YCP: సంక్రాంతి సంబరాలను క్యాసినో అంటూ ప్రచారం.. చంద్రబాబుపై శ్రీకాంత్ రెడ్డి విమర్శలు

హైదరాబాద్‌లో నైట్ లైఫ్ కల్చర్ తెచ్చింది తానేనని టీడీపీ అధినేత చంద్ర బాబు అసెంబ్లీలో చెప్పలేదా..? అని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. సంక్రాంతి పందేలను బాబు..

YCP: సంక్రాంతి సంబరాలను క్యాసినో అంటూ ప్రచారం.. చంద్రబాబుపై శ్రీకాంత్ రెడ్డి విమర్శలు
Gadikota Srikanth Reddy

Updated on: Jan 25, 2022 | 6:58 PM

YCP – TDP: హైదరాబాద్‌లో నైట్ లైఫ్ కల్చర్ తెచ్చింది తానేనని టీడీపీ(TDP) అధినేత చంద్ర బాబు(Chandrababu) అసెంబ్లీలో చెప్పలేదా..? అని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి(Chief Whip Srikanth Reddy) ప్రశ్నించారు. సంక్రాంతి(Sankrati 2022) పందేలను బాబు క్యాసినో(casino)లుగా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. లేని క్యాసినో కల్చర్ ను రాష్ట్రానికి అంటగట్టాలన్నదే బాబు కుట్ర అని మండిపడ్డారు. తన స్వార్థ రాజకీయం కోసం తిమ్మిని బమ్మిని చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవ చేశారు. ఆ విద్యలతోనే ఎన్టీఆర్ లాంటి మహా నాయకుడ్ని వంచించాడని విమర్శించాడు. ఉద్యోగ సంఘాల తోకలు కత్తిరిస్తానని ఆరోజు మాట్లాడిన బాబు ఈరోజు మొసలి కన్నీరు కారుస్తున్నాడని అన్నారు.

చంద్రబాబు బాబుకు ప్రతిదానిలో స్వార్థ రాజకీయమే ఎజెండా.. ప్రజల ఎజెండాతో పనిలేదన్నారు. ముఖ్యమంత్రి రక్తం కళ్ళ చూస్తామని, మంత్రిని, పార్టీ నేతలను చంపేస్తామని మాట్లాడే మీరు అరాచకవాదులు కాదా? అని ప్రశ్నించారు.

సీఎంను అగౌరవపరిచే మాటలు మాట్లాడటం ఉద్యోగ సంఘాలకు సరైన పద్ధతి కాదని హితవు పలికారు. దుర్మార్గాలు చేయడంలో బాబు సిద్ధహస్తుడు చంద్రబాబు అని అన్నారు. దేశంలోనే తాను సీనియర్‌ రాజకీయ నాయకుడు అని చెబుతుంటారు కానీ, ఆ సీనియార్టీతో దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేయాలని.. కానీ ఆయన ఏరోజూ ఆలోచన చేయలేదన్నారు.

ఇవి కూడా చదవండి: Telangana Corona: తెలంగాణలో నైట్ కర్ఫ్యూపై కీలక ప్రకటన.. క్లారిటీ ఇచ్చిన హెల్త్ డైరెక్టర్..

UP Election 2022: సమాజ్‌వాదీ పార్టీకి మరో షాక్, బీజేపీలో చేరిన జలాల్‌పూర్ ఎమ్మెల్యే..

Loading...
Unable to load recommendations.
Follow Us