తమ ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో జనౌషధీ కేంద్రాలను ప్రారంభిస్తున్నామని, ఈ కేంద్రాల్లో మందులను తక్కువ ధరలకే కొనుగోలు చేయాలని ఆయన కోరారు. షిల్లాంగ్ లో ఆదివారం 7500 వ జనౌషధీ కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన సందర్భంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. జనౌషధీ దివస్ సెలబ్రేషన్స్ ను పురస్కరించుకుని’ప్రధానమంత్రి భారతీయ జనౌషధీ పరియోజన’ ద్వారా లబ్ది పొందినవారినుద్దేశించి మాట్లాడిన ఆయన..పేదలకు చౌక రేట్లకే ఔషధాలు అందించాలన్నది తమ సంకల్పమని, ఖరీదైన మందులను కొనలేని వీరు ఈ కేంద్రాల ద్వారా తక్కువ రేట్లకు మందులను కొనుగోలు చేయవచ్ఛునని చెప్పారు. వీటిని ‘మోదీ కీ దుకాన్ అని కూడా వ్యవహరించవచ్చునన్నారు.జనసుధ యోజన కింద తనకు ఎంతో సొమ్ము అదా అయిందని మధ్యప్రదేశ్ కి చెందిన ఓ మహిళ ఆయనకు తెలిపింది. తన కుమారుడి అస్వస్థత కు మందులు కొనేందుకు తాను ప్రతినెలా సుమారు 5 వేల రూపాయలను వెచ్చించేదానినని, కానీ ఇప్పుడు ఈ కేంద్రాల ద్వారా 2 వేల రూపాయలకే అన్ని మందులూ కొనగలుగుతున్నానని ఆమె చెప్పింది. ఇందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపింది.
జనౌషధి పై ప్రజల్లో అవేర్ నెస్ కలిగించేందుకుఈ నెల 1 నుంచి 7 వరకు జనౌషధీ సప్తాహ్ ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దేశంలో 7 వేలకు పైగా ఈ విధమైన కేంద్రాలు ఉన్నాయి. ఈ కార్యక్రమం కింద దాదాపు 9 వేల కోట్ల రూపాయలను కేటాయించామని మోదీ తెలిపారు. ముఖ్యంగా పేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక పథకాన్ని చేపట్టినట్టు ఆయన చెప్పారు.మరే దేశంలోనూ ఈ విధమైన పథకాలను అమలు చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఈ చౌక మందుల కొనుగోలు ద్వారా ప్రజలు సుమారు 3,600 రూపాయలను ఆదా చేయగలిగినట్టు అంచనా.. దేశంలో ఇప్పటివరకు లేని అన్ని జిల్లాల్లో ఈ జనౌషధీ కేంద్రాలను ప్రారంభించాలన్నది యోచన.
మరిన్ని ఇక్కడ చదవండి:
Shaakuntalam movie : గుణశేఖర్ శాకుంతలంకు దుశ్యంతుడు దొరికేసాడు.. ఆయన ఎవరోకాదు..
మయన్మార్ నుంచి ఎవరు వచ్చినా వెనక్కి పంపేయండి, హోమ్ శాఖ ఆదేశాలు