Congress Party: సీఎం అభ్యర్ధి ఎవరన్న విషయంపై కాంగ్రెస్‌ క్లారిటీ.. ఆ ఇద్దరి నేతృత్వంలోనే పోటీకి సై..

రానున్న పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సీఏం అభ్యర్ధి ఎవరన్న విషయంపై క్లారిటీ ఇచ్చింది కాంగ్రెస్‌ అధిష్టానం. సీఎం చరణ్‌జీత్‌సింగ్‌ , పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్దూ నేతృత్వం లోనే ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్‌ హైకమాండ్‌...

Congress Party: సీఎం అభ్యర్ధి ఎవరన్న విషయంపై కాంగ్రెస్‌ క్లారిటీ.. ఆ ఇద్దరి నేతృత్వంలోనే పోటీకి సై..
Congress Party

Updated on: Sep 20, 2021 | 10:01 PM

రానున్న పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్ధి ఎవరన్న విషయంపై క్లారిటీ ఇచ్చింది కాంగ్రెస్‌ అధిష్టానం. సీఎం చరణ్‌జీత్‌సింగ్‌ , పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్దూ నేతృత్వం లోనే ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్‌ హైకమాండ్‌ స్పష్టం చేసింది. పంజాబ్‌లో తొలి దళిత సీఎంను బీజేపీ , అకాలీధళ్‌, ఆప్‌ పార్టీలు అవమానిస్తున్నాయని విమర్శించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్కరైనా దళిత సీఎం ఉన్నారా..?  అంటూ కాంగ్రెస్‌ ప్రశ్నించింది. ఈవిషయంలో ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించే ధైర్యం ఆప్‌, అకాలీదళ్‌ నేతలకు లేదంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.

అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్ధిగా సిద్దూనే ప్రకటిస్తారని.. చరణ్‌జీత్‌ డమ్మీ సీఎం అని అటు అకాలీదళ్‌ ఇటు ఆప్‌ నేతలు విమర్శించారు. కొందరు కాంగ్రెస్‌ నేతలు కూడా సిద్దూను సీఎం అభ్యర్ధిగా అంగీకరించడం లేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది.

అయితే.. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చరణ్‌జిత్ సింగ్ చన్నీపై అప్పుడే ఆరోపణల పర్వం మొదలయ్యింది. మీటూ సెగ పంజాబ్‌ కొత్త సీఎంకు తాకింది. 2018లో మంత్రిగా ఉన్న సమయంలో ఓ లేడీ ఐఏఎస్‌కు అసభ్యకరమైన మెసేజ్‌ పంపారని చరణ్‌జీత్‌పై ఆరోపణలు వచ్చాయి. ఆ మహిళా అధికారి పంజాబ్‌ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేశారు. కాని పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేయలేదు. లేడీ ఐఏఎస్‌కు అప్పట్లో చరణ్‌జీత్‌ సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగిందని భావించారు. తాను దళితుడిని కాబటే టార్గెట్‌ చేశారని మీటూ ఆరోపణలపై కౌంటర్‌ ఇచ్చారు చరణ్‌జీత్‌. మీటూ ఆరోపణలొచ్చిన చన్నీని సీఎంగా ఎంపిక చేయడంపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి: Hyderabad: దూసుకుపోతున్న హైదరాబాద్.. ఢిల్లీ, ముంబై ఆ తర్వాత మనమే.. ఎందులోనో తెలుసా..

PAN Aadhaar Linking: పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఈ 5 నష్టాలు తప్పవు.. ఇందులో ఇవి చాలా ముఖ్యం..