సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో టీడీపీ నేతలతో ఏపీ సీఎం, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపుపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఓట్ల లెక్కింపు చివరివరకు కౌంటింగ్ కేంద్రాల్లో ఉండాలని నేతలకు సూచించారు. ఎవరైనా అరాచకాలకు పాల్పడినా సంయమనం పాటించాలని.. టీడీపీ గెలుపును ఏ శక్తి ఆపలేదన్నారు.