కేసీఆర్‌తో జగన్ కలవడం తప్పుకాదు.. కానీ : చంద్రబాబు

శ్రీకాకుళంః ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నేడు శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎచ్చర్లలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్, జగన్‌ల గురించి మాట్లాడారు. కేసీఆర్‌తో జగన్ కలవడం తప్పుకాదు, తప్పున్నర్ర అన్నారు. కేసీఆర్‌ మనల్ని తిట్టాడు, కుక్కలు, రాక్షసులు అన్నాడు. మన బిర్యానీని పేడ అని, ఉలవచారును పశువులు తింటాయని అన్నాడని చెబుతూ అని చంద్రబాబు మండిపడ్డారు. ఒక్క పిలుపు ఇస్తే రైతులు 35 వేల ఎకరాలు ఇచ్చారని చంద్రబాబు […]

కేసీఆర్‌తో జగన్ కలవడం తప్పుకాదు.. కానీ : చంద్రబాబు

Edited By:

Updated on: Apr 05, 2019 | 4:01 PM

శ్రీకాకుళంః ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నేడు శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎచ్చర్లలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్, జగన్‌ల గురించి మాట్లాడారు. కేసీఆర్‌తో జగన్ కలవడం తప్పుకాదు, తప్పున్నర్ర అన్నారు. కేసీఆర్‌ మనల్ని తిట్టాడు, కుక్కలు, రాక్షసులు అన్నాడు. మన బిర్యానీని పేడ అని, ఉలవచారును పశువులు తింటాయని అన్నాడని చెబుతూ అని చంద్రబాబు మండిపడ్డారు.

ఒక్క పిలుపు ఇస్తే రైతులు 35 వేల ఎకరాలు ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధానిలో రూ. 55 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. ప్రపంచంలోని ఐదు అగ్రనగరాల్లో అమరావతి ఉంటుందని, ఇచ్చాపురం నుంచి భోగాపురం వరకు బీచ్‌ రోడ్‌ వేస్తామని, టూరిజంను ప్రమోట్ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.