రైతులు రోడ్డెక్కే పరిస్థితి మంచిది కాదు.. వ్యవసాయ చట్టాల్లో మద్దతు ధరను చేర్చాలని కోరిన టీడీపీ అధినేత

|

Jan 26, 2021 | 3:00 PM

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై దేశవ్యాస్తంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం..

రైతులు రోడ్డెక్కే పరిస్థితి మంచిది కాదు.. వ్యవసాయ చట్టాల్లో మద్దతు ధరను చేర్చాలని కోరిన టీడీపీ అధినేత
Follow us on

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై దేశవ్యాస్తంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇక గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ రణరంగాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనపై రియాక్ట్‌ అయ్యారు చంద్రబాబు.

దేశానికి అన్నం పెట్టే రైతులు రోడ్డెక్కే పరిస్థితి మంచిది కాదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రైతుల ఆందోళనను కేంద్రం పరిగణనలోకి తీసుకుని సమస్యను పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. పంటలకు మద్దతు ధరను చట్టాల్లో పెట్టాలని, మార్కెట్‌ కమిటీలను కొనసాగించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

ఇక పంచాయతీ ఎన్నికల నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు చంద్రబాబు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగానే.. అటు సీఎంను, ఇటు సీఎస్‌ను కలిపి విమర్శలు చేశారు. జగన్‌ కేసుల్లో సహ నిందితుడు ఇప్పుడు సీఎస్‌గా ఉన్నారని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు కోర్టులో ఒక జడ్జికి కేసు రాకుండా ఏం చేయాలో అన్నీ చేశారని, జడ్జిలు, బెంచ్‌లు మారినంత మాత్రాన న్యాయం మారదని కామెంట్‌ చేశారు.